
న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీ ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అధ్వర్యంలో తందూరి ఫ్లేమ్స్ రెస్టారెంట్‌లో ఈ వేడుకలు జరిగాయి. వందలాది మంది వైఎస్సార్ అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా వైఎస్సార్ లాగే పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ 50 రోజుల పాలన చాలా బాగుందని ప్రశంసించారు. సీఎం జగన్ అమెరికా పర్యటన కోసం వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్ కడప రత్నాకర్, వైఎస్సార్ పౌండేషన్ కోర్ సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి గాగసాని, వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కోర్ టీమ్ సభ్యులు డాక్టర్ త్రివిక్రమ భానోజ్‌రెడ్డి, పార్సిప్పనీ టౌన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, ఐఏసీసీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఐఏసీసీ అధ్యక్షుడు దుత్తారెడ్డి,, నాటా వర్కింగ్ కమిటీ సభ్యులు, వైఎస్సార్ పౌండేషన్ కమిటీ సభ్యులు, ఆటా వర్కింగ్ కమిటీ సభ్యులు, డాక్టర్ వాసుదేవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.