చెదరిపోని గుండె బలం... నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
జులై 8, 1949న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి, సెప్టెంబర్ 2, 2009న అనూహ్యంగా హెలికాప్టర్ కూలిన ఘటనలో కన్నుమూశారు. ఆయన జయంతిని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్‌సిపి నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జులై 8, 2023 శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు 13869 పార్క్ సెంటర్ రోడ్, హెర్న్‌డన్, వర్జీనియాలో ఈ కార్యక్రమం జరగనుంది.
అమెరికాలో పర్యటిస్తోన్న YSRCP సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అమెరికాలోని వైఎస్సార్‌సిపి కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరికాతో డా.వైఎస్సార్‌కు అనుబంధం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అమెరికాలోని ప్రవాసాంధ్రులతో ప్రత్యేక అనుబంధం ఉంది. మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అమెరికాలో పర్యటించారు. నాడు ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా డా.వైఎస్సార్‌ను ఆహ్వానించింది. షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలు, సంక్షేమం, అభివృద్ధి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మహానేత వైఎస్సార్‌ను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. హాజరు కావాలనుకుంటున్న వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఈ ఫాం పూరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
►ఫాం పూరించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నాటి గవర్నర్ అర్నాల్ ష్క్వార్జ్ నెగ్గర్ తో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్
ఫైల్: డా.వైఎస్సార్ అమెరికాలో పర్యటించినప్పటి దృశ్యం
-రత్నాకర్, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment