సురేఖవాణి కూతురు బర్త్‌డే.. పబ్‌లో డ్యాన్స్ చేస్తూ! | Surekhavani daughter Birthday Celebrates In New Jersey | Sakshi
Sakshi News home page

Surekhavani: సుప్రిత బర్త్ డే వేడుకలు.. పబ్‌లో హంగామా చేస్తూ రచ్చ!

Published Tue, Aug 8 2023 3:20 PM | Last Updated on Tue, Aug 8 2023 3:59 PM

Surekhavani daughter Birthday Celebrates In New Jersey - Sakshi

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పాపులర్‌ అయిన ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.  సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అలరిస్తూ  ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటోంది.

(ఇది చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్‌ హీరోయిన్‌!)

ఇకపోతే సురేఖవాణి, తన కూతురు సుప్రీత కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టిపొట్టి బట్టలతో గ్లామర్‌ ఫోటోలను తరచూ షేర్‌ చేస్తుంటారు. పార్టీలు, పబ్స్‌, వెకేషన్స్‌కు అంటూ తల్లీ,కూతుళ్లు కలిసే తిరుగుతూ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తుంటారు. ఇటీవలే అమెరికాలో ఈ తల్లీకూతుళ్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీ వీధుల్లో సుప్రిత, సురేఖా వాణి హల్‌ చల్‌ చేశారు.

తాజాగా తన కూతురు సుప్రిత బర్త్‌ డే సందర్భంగా సురేఖ బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. న్యూజెర్సీలోని వీధుల్లో  తండ్రితో సుప్రిత ఉన్న ఫోటోను ఓ బిల్డింగ్‌పై ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. ఇక ఆ ఫోటోను చూసిన సుప్రిత తీవ్ర భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియోను సురేఖా వాణి తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది.

(ఇది చదవండి: హాలీవుడ్ స్టార్స్‌కి తెలుగు నేర్పిన ఆలియా!)

అంతే కాకుండా సుప్రిత తన బర్త్ డే సందర్భంగా పబ్బులో ఫ్రెండ్స్‌తో కలిసిసెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్సులు చేస్తూ హంగామా చేసింది. మొత్తానికి సుప్రిత బర్త్‌ డే వేడుకల్లో పబ్బులో సందడి చేస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలను సుప్రిత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement