
న్యూయార్క్: హెచ్1 బీ వీసాదారుల పిల్లల కాలేజీ చదువుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా అమెరికాలోని న్యూజెర్సీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగి ఉన్న భారతీయుల సంఖ్య అధికమే. వారికి, ముఖ్యంగా న్యూజెర్సీలో ఉండే భారతీయులకు తమ పిల్లల పై చదువుల భారం ఈ కొత్త చట్టంతో కొంత తగ్గనుంది.
ఈ ‘ఎస్2555’పై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ మంగళవారం సంతకం చేశారు. ఈ చట్టం ప‍్రకారం తల్లిదండ్రులు, లేదా గార్డియన్లు హెచ్1 బీ వీసాదారులైనట్లయితే.. వారి డిపెండెంట్ పిల్లలకు కాలేజీ లేదా యూనివర్సిటీ కోర్సులో ‘అవుట్‌ఆఫ్ స్టేట్ ట్యూషన్’ ఫీజు ఉండదు. అయితే, ఈ అవకాశం కొన్ని షరతులకు లోబడి లభిస్తుంది. ఈ పిల్లలు న్యూజెర్సీ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా న్యూజెర్సీ హైస్కూల్‌లో కనీసం మూడేళ్లు చదవి ఉండాలి అనేది ఆ షరతుల్లో ఒకటి. న్యూజెర్సీలో ప్రిన్స్‌టన్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నాయి. న్యూజెర్సీ వాసులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment