
హెచ్–1బీ స్టూడెంట్ వీసాపై కొత్త నిబంధనలు
అమెరికాలో మాస్టర్ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే హెచ్–1బీ వీసాలపై కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.
ప్రతీ ఏడాది 65 వేల హెచ్–1బీ, అమెరికాలో ఉన్నత విద్య చదివిన వారికి అదనంగా 20 వేల హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. కాలిఫోర్నియాకు చెందిన లీనా ఆర్ కామత్ తనకు హెచ్–1బీ వీసా(అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికిచ్చే) కేటగిరీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేయగా... ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. డిగ్రీ తీసుకునే సమయానికి అతను చదివిన ఇంటర్నేషన్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు లేదని పేర్కొంది.