హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు | Four Indian Americans Arrested For H1B Visa Fraud | Sakshi
Sakshi News home page

హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు

Published Wed, Jul 3 2019 10:20 AM | Last Updated on Wed, Jul 3 2019 10:21 AM

Four Indian Americans Arrested For H1B Visa Fraud - Sakshi

వాషింగ్టన్‌ : హెచ్‌1 బీ వీసాల మోసానికి పాల్పడుతున్న నలుగురు ఇండో అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. న్యూజెర్సీ, కాలిఫోర్నియాల్లోని రెండు వేర్వేరు ఐటీ కంపెనీలకు చెందిన విజయ్‌ మానే(39), వెంకటరమణ(47), ఫెర్నాండో సిల్వా(53), సతీశ్‌ వేమూరి(52)లను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం కోర్టులో హాజరు పరిచిన అనంతరం 2.5 లక్షల పూచీకత్తుపై వీరు బెయిలుపై విడుదలయ్యారు.

కాగా ఈ నలుగురు కలిసి న్యూజెర్సీ కేంద్రంగా ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌, క్లైంట్‌ ఏ, కాలిఫోర్నియా కేంద్రంగా క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ పేరిట ఐటీ స్టాఫింగ్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం పొందాలనుకున్న విదేశీయులకు హెచ్‌1 బీ వీసా ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అమెరికా హెచ్‌1బీ వీసా జారీచేస్తుందన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement