ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : హెచ్-1 బీ వీసాల మోసానికి పాల్పడుతున్న ఇండో- అమెరికన్‌ను సిలికాన్ వ్యాలీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్, హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి తప్పుడు పత్రాలు సమర్పించి విదేశీయులకు బోగస్ వీసాలు అందించిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం అతడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
వివరాలు.. భారత్‌కు చెందిన కిషోర్ కుమార్ కవురు(46) నాలుగు కన్సల్టెన్సీ సంస్థలకు యజమానిగా ఉన్నాడు. త్వరితగతిన వీసాలు జారీ చేస్తామంటూ విదేశీయులకు గాలం వేసేశాడు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోగస్ వీసాలు అంటగట్టాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను కూడా తయారు చేసుకున్నాడు. కాగా వీసా ఫ్రాఢ్ నేరంలో అతడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు, 2.5 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment