ధర్మశాల: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంతగా ఉందో.. అంతకంటే ఎక్కువగా నెగిటీవ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో హార్దిక్ ఏం పోస్ట్ చేసినా కుప్పలు తెప్పలుగా కామెంట్స్ వచ్చి పడతాయి. దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి టీమిండియా స్పాన్సర్‌గా ఆన్‌లైన్ ట్యుటోరియల్ సంస్థ ‘బైజూస్’ వ్యవహరించనుంది. దీంతో బైజూస్ లోగో ఉన్న టీమిండియా కొత్త జెర్సీని ధరించి దిగిన ఫోటోను హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోను ట్రోల్ చేస్తూ నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.
‘వావ్.. ఓ నిరక్షరాస్యుడు ఎడ్యుకేషనల్ సైట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. గ్రేట్’, ‘బైజుస్ లోగో ఛాతిపై ఉండటంతో హార్దిక్ మరింత నిజాయితీ గల వ్యక్తిలా కనిపిస్తున్నాడు’, అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘బైజూస్ యాప్‌ను పియూష్ గోయల్ ఉపయోగిస్తే బెటర్.. ఎందుకంటే ఫిజిక్స్, హిస్టరీ తెలుస్తుంది’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభం కానుంది. ఇక వెస్టిండీస్ పర్యటనకు హార్దిక్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు దక్షిణాఫ్రికా సిరీస్‌కు తిరిగి ఎంపిక చేశారు. హార్దిక్‌తో పాటు అతడి అన్న కృనాల్ పాండ్యాకు కూడా అవకాశం కల్పించారు.
Wow so an educational site made a proudly uneducated man it's ambassador. 😂😂 https://t.co/UE2vCi0URA
— ANISH MAINALI (@itsanishm) September 13, 2019
చదవండి:
‘ఆ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది’
క్రికెట్ అభిమానులకు ‘జియో’ గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment