
న్యూజెర్సీ: అమెరికాలోని తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే తాజాగా నాట్స్ న్యూజెర్సీలో టెన్నిస్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. తెలుగు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. గత కొన్ని వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు ఆడించి, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ టోర్నీలో ప్లయిన్స్‌బొరో జట్టు(కృష్ణ కిషోర్ బండి, వాసుదేవ మైల) విజేతగా, సౌత్ జెర్సీ జట్టు(సందీప్ అనంతుల, రమేశ్ జంగా) రన్నరప్‌గా నిలిచాయి. నాట్స్ నేషనల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కొణిదెల ఈ టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. నాట్స్ నాయకులు కుమార్ వెనిగళ్ల, వంశీ వెనిగళ్ల టోర్నమెంటు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. టెన్నిస్ టోర్నమెంటుకు కావాల్సిన సహయ సహకారాలు అందించిన నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవకు నాట్స్ క్రీడా విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇక టోర్నమెంట్ విజేతలకు నాట్స్ ముఖ్య నాయకులు బహుమతులు ప్రదానం చేశారు.
బహుమతుల ప్రదానోత్సవంలో మోహనకృష్ణ మన్నవ, అరుణ గంటి, గంగాధర్ దేసు, సూర్యం గంటి, శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, మురళీ మేడిచర్ల, చక్రధర్ ఓలేటి, విష్ణు ఆలూరు, సురేశ్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేశ్ బేతపూడి, శ్రీనివాస్ మెంట, శేషగిరి కంభంమెట్టు, శ్రీనివాస్ భీమినేని, శ్రీథర్ దోనేపూడి, ప్రశాంత్ గోరంట్ల, రామకృష్ణ నరేడ్ల, విష్ణు కనపర్తి, సుధాకర్ తురగా, రాకేశ్ దొమ్మాలపాటి, కిరణ్ చాగర్లమూడి తదితర నాట్స్ నాయకులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ఆటగాళ్లను వీరు ప్రత్యేకంగా ప్రశంసించారు. బావర్చీ బిర్యానీ, ఎన్‌జే లైఫ్ ఈ కార్యక్రమానికి స్పానర్స్గా వ్యవహరించారు.













Comments
Please login to add a commentAdd a comment