North America Telugu Society (NATS)
-
నాట్స్ ఆధ్వర్యంలో టెన్నిస్ డబుల్స్ టోర్నమెంట్
న్యూజెర్సీ: అమెరికాలోని తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే తాజాగా నాట్స్ న్యూజెర్సీలో టెన్నిస్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. తెలుగు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. గత కొన్ని వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు ఆడించి, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ టోర్నీలో ప్లయిన్స్‌బొరో జట్టు(కృష్ణ కిషోర్ బండి, వాసుదేవ మైల) విజేతగా, సౌత్ జెర్సీ జట్టు(సందీప్ అనంతుల, రమేశ్ జంగా) రన్నరప్‌గా నిలిచాయి. నాట్స్ నేషనల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కొణిదెల ఈ టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. నాట్స్ నాయకులు కుమార్ వెనిగళ్ల, వంశీ వెనిగళ్ల టోర్నమెంటు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. టెన్నిస్ టోర్నమెంటుకు కావాల్సిన సహయ సహకారాలు అందించిన నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవకు నాట్స్ క్రీడా విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇక టోర్నమెంట్ విజేతలకు నాట్స్ ముఖ్య నాయకులు బహుమతులు ప్రదానం చేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో మోహనకృష్ణ మన్నవ, అరుణ గంటి, గంగాధర్ దేసు, సూర్యం గంటి, శ్రీహరి మందాడి, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, మురళీ మేడిచర్ల, చక్రధర్ ఓలేటి, విష్ణు ఆలూరు, సురేశ్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేశ్ బేతపూడి, శ్రీనివాస్ మెంట, శేషగిరి కంభంమెట్టు, శ్రీనివాస్ భీమినేని, శ్రీథర్ దోనేపూడి, ప్రశాంత్ గోరంట్ల, రామకృష్ణ నరేడ్ల, విష్ణు కనపర్తి, సుధాకర్ తురగా, రాకేశ్ దొమ్మాలపాటి, కిరణ్ చాగర్లమూడి తదితర నాట్స్ నాయకులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ఆటగాళ్లను వీరు ప్రత్యేకంగా ప్రశంసించారు. బావర్చీ బిర్యానీ, ఎన్జే లైఫ్ ఈ కార్యక్రమానికి స్పానర్స్గా వ్యవహరించారు. -
నాట్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు
చికాగో: 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..' అంటూ చికాగోలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) చికాగో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించింది. ప్రవాస భారతీయులు ఈ ర్యాలీలో పాల్గొని జన్మభూమి పట్ల వారికి ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ఈ ర్యాలీ అనంతరం ప్రవాస భారతీయుల పిల్లలు జనగణమన అధినాయక జయహే.. అంటూ భారత జాతీయ గీతం పాడి భారత్ పై తమకున్న ప్రేమను చాటారు. కన్నతల్లిని, జన్మభూమిని ఎన్నటికి మరిచిపోరాదని చాటేందుకు మాతృభూమిపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని నాట్స్ నాయకులు మదన్ పాములపాటి అన్నారు. ఈ ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (కోవిడ్ టైం.. ఆయనో ధైర్యం) నాట్స్ బోర్డు డైరెక్టర్లు మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నాయకులు కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మి బుజ్జా ఈ ర్యాలీ విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు. చికాగో నాట్స్ విభాగ నాయకులు వేణు కృష్ణార్ధుల, ప్రసుధ సుంకర, బిందు వీధులమూడి, హరీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, భారతీ పుట్టా, పాండు చెంగళశెట్టి, మూర్తి కొగంటి తదితరులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ ర్యాలీని దిగ్విజయం చేశారు. చికాగో యునైటెడ్ కమ్యూనిటీ నాయకులు చాందిని దువ్వూరి, లింగయ్య మన్నెలు కూడా ఈ ర్యాలీకి తమ వంతు తోడ్పాటు అందించారు. (పారిశుధ్య కార్మికులకు నాట్స్ సాయం) -
నాట్స్ కవితల పోటీ పురస్కార విజేతలు
డల్లాస్ : భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కవులు పాల్గొన్నారు. 913కి పైగా అందిన కవితల్లోంచి 9 మందిని విజేతలుగా ఎంపిక చేసి, వారితో కవి సమ్మేళనం నిర్వహించిన అనంతరం ఎవరు ఏ పురస్కారాన్ని అందుకున్నారో ప్రకటించామని ఈ కార్యక్రమ నిర్వాహకులు డా.సూర్యం గంటి తెలిపారు. నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె, నిర్వాహకులు డా సూర్యం గంటి, డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి విజేతలను ప్రకటించారు. విజేతలు.. వారి బహుమతులు సర్వోత్తమ పురస్కారం: రూ 20,000/-: దోర్నాథుల సిద్ధార్థ ఉత్తమ పురస్కారం: రూ 15,000/-: వంగర పరమేశ్వర రావు విశిష్ట పురస్కారం: రూ 10,000/-: నూజిళ్ల శ్రీనివాస్ విశేష పురస్కారం: రూ 5,000/-: కిరణ్ విభావరి గౌరవ పురస్కారం-1: రూ. 2000/- : వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని) గౌరవ పురస్కారం-2: రూ. 2000/- : శిరీష మణిపురి గౌరవ పురస్కారం-3: రూ. 2000/- : జోగు అంజయ్య గౌరవ పురస్కారం-4: రూ. 2000/- : అల్లాడి వేణు గోపాల్ గౌరవ పురస్కారం-5: రూ. 2000/- : చెరుకూరి రాజశేఖర్ "పురస్కారాలు గెలుపొందిన తొమ్మిది మంది కవులూ సినీ కవులైన చంద్రబోసు, భాస్కర భట్ల, సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రితో కవితా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 14 సాయంత్రం తెలుగువారు అభివృద్ధి చేసిన ఆన్‌లైన వీడియో ప్లాట్‌ఫాం https://nristreams.tv/NATS-live/ లోనూ నాట్స్ యూట్యూబ్ ఛానల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ ప్రసారం చేశామని, దీన్ని అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారని సంచాలకులు రాజశేఖర్ అల్లాడ తెలిపారు. మొదటి సారిగా ఈ ప్రయత్నం చేశాం. అనుకున్నదాని కంటే గొప్ప స్పందన లభించిందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. "భాషే రమ్యం- సేవే గమ్యం మా నాట్స్ నినాదం. ఆ దిశలో భాష విషయంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. కవితల పోటీలలో పురస్కారాలు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు. ఇంకా మరిన్ని కవితలు మరింత గొప్పగా వ్రాయాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన చంద్రబోసు గారికి, సిరాశ్రీ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు" అని నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె చెప్పుకొచ్చారు. (500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం) "ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలనే ఉత్సాహం నాట్స్ కి కలుగుతోంది. దీనికి కారణభూతమైన అశేషమైన కవులకు, కవయిత్రులకు మా కృతజ్ఞతలు. తెలుగు భాషకు చేస్తున్న సేవలో మీ ప్రోత్సాహం శిరోధార్యం", అని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. యాప్‌లో ప్రసారమైన ఆన్లైన్ కవి సమ్మేళన కార్యక్రమంలో చివరిగా సినీ కవులు కూడా తమ దేశభక్తి కవితలను చదివి వినిపించారు. "విశేషమేమిటంటే జూమ్‌లో కాకుండా పూర్తిగా తెలుగువారి చేత తయారు చేయబడిన NRI STREAMS CONNECT APP ద్వారా ఈ ఆన్లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించడం మరింత ఔచిత్యంగా అనిపిస్తోంది" అని సినీ కవి చంద్రబోస్ అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ లింకుల్లో చూడవచ్చు: https://nristreams.tv/NATS-live/ అండ్ https://www.youtube.com/watch?v=yWoDY7queO0 -
విశాఖలో ‘బోస్టన్’ కొత్త కార్యాలయం
సాక్షి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు లైన్ క్లియర్ కావడంతో పలు అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల ఆగస్టు 5న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రఖ్యాత బోస్టన్ గ్రూప్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, బోస్టన్ గ్రూప్, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ ఛైర్మన్ సుబ్బు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. విశాఖలో ఏర్పాటు కానున్న ఈ కొత్త కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ మరియు హ్యూమన్ రిసోర్సెస్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు చేస్తుంది. వైజాగ్ వంటి టూ టైర్ నగరాల్లో గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ నిపుణుల ప్రతిభ ఆర్ధిక ప్రగతికి బాటలు వేస్తుందని సుబ్బు కోట అన్నారు. (వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం) విజయవాడకు చెందిన సుబ్బు.. భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తగా, ఫిలాంత్ర ఫిస్ట్గా గుర్తింపు పొందారు. అమెరికాలో నివాసముంటున్న సుబ్బు కోట గత 50 ఏళ్లలో దాదాపు 50 కంపెనీలను ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఇ-లెర్నింగ్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో విస్తృత అనుభవాన్ని గడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో తమ సంబంధాలు బలోపేతం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించడంలో విశాఖ దేశంలోనే అతిముఖ్యమైన గమ్యస్థానంగా మారుతోందని తెలిపారు. పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతమని, ఆర్థిక కేంద్రంగా ఎదిగేందుకు విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచం కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి సహకారాలు ఎంతో అవసరమన్నారు. పీపుల్ ప్రైమ్ వరల్డ్‌వైడ్ (ది బోస్టన్ గ్రూప్ అనుబంధ సంస్థ) సీఈవో రవి అలెటి మాట్లాడుతూ “కనెక్టివిటీ, కాస్మోపాలిటన్ పాపులేషన్, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీలతో విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్ లో ప్రపంచ నగరంగా విశాఖ రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. విశాఖలోని సెజ్ జోన్లలో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తామని రవి తెలిపారు. విశాఖను ఐటీ హబ్ గా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేదుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని, ప్రతిభావంతులైన నిపుణులు, ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలకు విశాఖ నెలవు అని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నార్త్ అమెరికా పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉందని, సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నూతన విధానాన్ని తెచ్చారన్నారు . బోస్టన్ గ్రూప్ గురించి.. 1988 లో ది బోస్టన్ గ్రూప్ స్థాపించబడింది. ఫార్చ్యూన్ 500, మిడ్-మార్కెట్ క్లయింట్లకు సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ మరియు ఐటి సేవలను అందించే ప్రధాన వ్యాపారంతో ఈ సంస్థ ప్రారంభమైంది. నాటి నుండి, టిబిజి తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఐటి ఔట్ సోర్సింగ్, ఇ-లెర్నింగ్, ఇ- గవర్నెన్స్ తదితర సేవలను అందిస్తోంది. మొత్తం ఐదు దేశాలలో టీబీజీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫార్మా, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వస్తు తయారీ, బ్యాంకింగ్, రిటైల్ వంటి అనేక రకాల పరిశ్రమలకు సేవలు అందిస్తుంది. -
టెంపాబే లో నాట్స్ సాయం
మెక్సికో: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను దాదాపు 300 మందికిపైగా అందించింది. స్థానికంగా ఉండే బటర్ ప్లై ఫార్మసీ కూడా దీనికి తన వంతు సహకారం అందించింది. అవసరమైన వారికి మాస్కులు, గ్లౌజులు కూడా నాట్స్ పంపిణీ చేసింది. (చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ చేయూత) ప్లోరిడా హౌస్ ప్రతినిధి మిస్ డయాన్ ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరై నాట్స్ నాయకులను అభినందించారు. ఈ కష్టకాలంలో నాట్స్ ముందుకు వచ్చి సాయం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. స్థానిక పోలీసులు కూడా డ్రైవ్ త్రూ లైన్ లలో ట్రాఫిక్‌ను మళ్లించి ఈ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చేశారు. దీనికి నాట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ టెంపా బే కోర్ టీం సభ్యులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని,రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ ఆరికట్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ నిత్యావసరసరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. బటర్ ఫ్లై ఫార్మసీ నుంచి జన్ను కుటుంబం, టోని, టుటూ తో పాటు ఫార్మసీ కార్యాలయం సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరుకులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ మేడిచర్లకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. టెంపాబే స్ఫూర్తితో మరిన్ని ఛాప్టర్లలో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.(శాన్ఎన్టానియోలో నాట్స్ ఉదారత) -
మీ వాళ్లకు ఇక్కడ భయం లేదు
వాషింగ్టన్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పెద్దన్న అమెరికాను కూడా గడగడలాడిస్తుంది. రోజు రోజుకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా సోకి మరణించిన వారి సంఖ్యలో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమెరికాలో కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి రత్నకర్ ఆర్ పాండుగయాలా ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ‘దేశంలో ఏప్రియల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ట్రావెల్ బ్యాన్ కొనసాగుతుంది. అదే విధంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 2.5 లక్షల వాలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటిని సోదా చేస్తూ ఏ కొంచెం కరోనా లక్షణాలు ఉన్నా వారికి వెంటనే వైద్యపరీక్షలు అందిస్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చరిత్రలో చూసి ఉండరు’ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... ‘నార్త్ అమెరికాలో ఉంటున్న తెలుగువారందరికి మీ కుటుంబం పట్ల మీరు భయపడాల్సిన పని లేదని నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పట్ల శ్రద్దతో కరోనా వైరస్వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మీరు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండండి. డబ్ల్యూహెచ్ఓ చెప్పిన మార్గదర్శకాలు పాటించి కరోనా వైరస్ విస్తరించకుండా స్వీయ రక్షణ చర్యలు పాటించండి. ఎప్పటిప్పుడు చేతులను శానిటైజర్‌తో కడుక్కోండి. మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చూపించుకోండి. సామాజిక దూరాన్నిపాటించి ప్రభుత్వాలకు సహాకరించండి. మనం కలిసికట్టుగా పోరాడితే ఈ కష్టకాలం నుంచి బయటపడవచ్చు’ అని పేర్కొన్నారు. -
బోస్టన్‌లో ఇళయరాజా పాటల హోరు
బోస్టన్: తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బోస్టన్ లో ఇళయరాజా పాటల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. బోస్టన్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగువారిలో గాన మాధుర్యం ఉన్న కళకారులను ప్రోత్సాహించే ఉద్దేశంతో నాట్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మధుచారి ఆధ్వర్యంలో 21 మందితో గాయనీ, గాయకులతో కూడిన మధురవాణి బృందం ఇళయరాజా స్వరపరిచిన పాటలను పాడి ప్రేక్షకులను అలరించింది. ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదభరితంగా సాగింది. ఐదుగురితో కూడిన వ్యాఖ్యతల బృందం మధ్య మధ్యలో ఇళయారాజా సాధించిన సంగీత విజయాలు.. ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తూ.. కార్యక్రమానికి వన్నె తెచ్చారు. సెయింట్ లూయిస్, న్యూజెర్సీల నుంయి విచ్చేసిన నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ సభ్యులు మోహన్ కృష్ణ మన్నవ , శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీ వెనిగళ్ల తదితరులు నాట్స్ బోస్టన్ విభాగం చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఇంకా ఈ పాటల కార్యక్రమంలో పాల్గొన్న మధురవాణి బృంద సభ్యులను, వ్యాఖ్యాతలను శాలువలతో ఘనంగా సత్కరించారు. స్థానిక తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ ఏరియా ప్రెసిడెంట్ సీతారాం అమరవాదితో పాటు పలువురు స్థానిక తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దాదాపు 250 మందికి పైగా స్థానిక తెలుగు వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళయారాజా పాటల సందడిలో మధురానుభూతులు పొందారు. ఇళయరాజా పాటల కార్యక్రమం మధురవాణిని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు ఈ బృందంలో పాడిన గాయని, గాయకులకు నాట్స్ బోస్టన్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ గొంది గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటల కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో నాట్స్ టీం సభ్యులు కూడా ఎంతో కృషి చేశారని... ఇదే ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలను బోస్టన్ లో చేపడతామని శ్రీనివాస్ గొంది ప్రకటించారు -
టెంపాలో నాట్స్ ఆర్ధిక అక్షరాస్యత సదస్సు
ఫ్లోరిడా : అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో ఆర్ధిక అక్షరాస్యతపై సదస్సు నిర్వహించింది. అమెరికాలో ఆర్ధికాంశాలపై అవగాహన కల్పించేందుకు టెంపాలోని న్యూ టెంపా రీజనల్ లైబ్రరీలో ఈ సదస్సు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రముఖ ఆర్ధిక నిపుణులు శ్రీథర్ గౌరవెల్లి ఈ సదస్సుకు విచ్చేసి తన విలువైన సూచనలు సలహాలు అందించారు. దాదాపు 70 మందికి పైగా తెలుగువారు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉన్నతవిద్యకు ఎలా నిధులు పొందాలి? అమెరికాలో ఏ రిస్క్ కు ఎలాంటి బీమా ఉంటుంది? ట్యాక్స్ ప్రణాళికలో ఎలాంటి వ్యూహాలు ఉండాలి? గృహాలు, ఎస్టేట్ లు కొనటానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆరోగ్య సంరక్షణకు ఎలా మనీ ప్లాన్ చేసుకోవాలి? సంపాదించే డబ్బును చక్కటి ప్రణాళికతో దేనికెంత ఖర్చు చేయాలి? పొదుపు ఎలా చేసుకోవాలి? లాంటి అనేక అంశాలపై చక్కటి అవగాహనను శ్రీథర్ గౌరవెల్లి కల్పించారు. వీటిపై ఈ సదస్సుకు విచ్చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆర్థికంగా ఎలా ప్రగతి సాధించాలనే అంశాలపై కూడా స్పష్టత ఇచ్చారు. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్థానిక తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. నాట్స్ ఆర్ధిక సదస్సు ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నామని ఈ సదస్సుకు విచ్చేసిన వారు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలోరాజేశ్ కండ్రు, వంశీలతో పాటు పలువురు నాట్స్ సభ్యులు పాల్గొన్నారు. -
చికాగోలో విజయవంతంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
చికాగో: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది. 15 జట్లు, 22 మ్యాచ్‌లతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నీలో పాల్గొన్న క్రికెటర్లు తమ ప్రతిభను చూపించారు. రేజింగ్ బుల్స్ టీం ఈ చికాగో క్రికెట్ టోర్నమెంట్ కప్ 2019 ను కైవసం చేసుకుంది. చికాగో నాట్స్ సభ్యులు మహేశ్ కాకర్ల, మూర్తి కొప్పాక, శ్రీనివాస పిడికిటి, రాజేశ్ వీదులమూడి, కృష్ణ నిమ్మగడ్డ, శ్రీనివాస బొప్పన, శ్రీథర్ ముమ్మనగండి, కృష్ణ నున్న, ఆర్కే బాలినేని, హారీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించారు. యజ్ఞేష్, అరుల్ బాబు, సందీప్ వెల్లంపల్లి, అరవింద్ కోగంటి, కృష్ణ నిమ్మగడ్డ, సంతోష్ పిండి, వినోద్ బాలగురు చక్కటి ప్రణాళికతో ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రశాంత్ నున్న, వెంకట్ దాములూరి, గోపాల్ శీలం, మురళీ కోగంటి, శ్రీకాంత్ బొజ్జా, వేణు కృష్ణార్ధుల, చెన్నయ్య కంబాల, పాండు చెంగలశెట్టి, మనోహార్ పాములపాటి, నవాజ్ తదితరులు చక్కగా టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేశారు. బావర్చి, హైదరాబాద్ హౌస్ భోజన ఏర్పాట్లు చేసింది. శ్రీని అర్షద్, స్మార్ట్ డెక్, రవి శ్రీకాకుళం, విండ్ సిటీ వాసు అడ్డగడ్డ కార్పొరేట్ స్పాన్సర్లుగా వ్యవహారించారు. -
అమెరికాలో తెలుగు వంటల పోటీలు..!
డల్హాస్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు డల్హాస్ వేదిక కావడంతో నాట్స్ ఈ సంబరాల కోసం పలు పోటీలు సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్హాస్ విభాగం ఆధ్వర్యంలో తెలుగు మహిళలకు వంటల పోటీలు నిర్వహించింది. మహిళలు రకరకాల వంటలతో ఆహా అనిపించారు. కమ్మనైన వంటలతో తమ పాకశాస్త్ర ప్రావిణ్యాన్ని చాటిచెప్పారు. సంజన కలిదిండి మొదటి స్థానం, రంజని రావినూతల రెండవ స్థానం, శ్రీవాణి హనుమంతు మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతీ మహిళను విజేతగా గుర్తిస్తున్నట్లు న్యాయ నిర్ణేతలు జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగ ప్రకటించారు. ఆపిల్, కొబ్బరి బర్ఫీ, కిళ్లీ కేక్, ఇండియన్ డోనట్ (బెల్లం గారె), జున్నుతో ప్రత్యేకమైన వంటలు తయారు చేశారు. చివరగా న్యాయనిర్ణేతలు శ్రేష్ఠ విజేతగా స్వాతి మంచికంటిని ప్రకటించారు. తెలుగు సంబరాల్లో మహిళలు మెచ్చే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు ‘నారీ సదస్సు’ సమన్వయకర్త రాజేశ్వరీ ఉదయగిరి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గ్రిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట తదితరులు సహకారం అందించారు. నాట్స్ సంబరాల కమిటీ ఈ పోటీల్లో విజేతలను ప్రత్యేకంగా అభినందించింది. మే 24 నుండి 26 వరకు డల్హాస్‌లోని అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే తెలుగు సంబరాలకు తెలుగువారంతా తరలిరావాలని నాట్స్ జాతీయ కమిటీ, సంబరాల కమిటీ ఆహ్వానించింది. -
అమెరికాలో ముగ్గుల పోటీలు
డల్హాస్: అమెరికాలో తెలుగు ఆడపడుచులు ముగ్గుల పోటీల్లో తమ కళాత్మకతను చూపెట్టారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో మే నెలలో డల్హాస్ వేదికగా జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాకంగా నాట్స్ నిర్వహిస్తూ పలు పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ డల్హాస్ విభాగం చేపట్టిన ముగ్గుల పోటీలకు చక్కటి స్పందన లభించింది. నాట్స్ నినాదానికి (భాషే రమ్యం సేవే గమ్యం) దగ్గరగా ఉన్న సుందరమైన చిత్రాన్ని ముగ్గు రూపంలో అందించిన గాయత్రి ఆలూరు మొదటి స్థానంలో నిలిచారు. వృక్షో రక్షతి రక్షితః అనే భావన ప్రతిబింబించేలా ముగ్గు వేసిన సంతోషి విశ్వనాధులకు రెండో స్థానంలో నిలిచారు.. దృష్టి, రక్షణ, రాజసం, ఆధ్యాత్మికత అన్న నాలుగు సందేశాలు అందిస్తున్న నెమలిని అందంగా ముగ్గు రూపంలో తీర్చిదిద్దిన శ్రీవాణి హనుమంతు మూడవ స్థానంలో దక్కించుకున్నారు. అమెరికా సంబరాలలో మహిళల జీవన సమతుల్యత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ‘నారీ సదస్సు’ సమన్వయ కర్త రాజేశ్వరి ఉదయగరి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గ్రిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట సహకరించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతీ మహిళను విజేతగా గుర్తిస్తున్నట్లు న్యాయ నిర్ణేతలు జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగ చెప్పారు. అమెరికా తెలుగు సంబరాలు మే 24 నుంచి 26 వరకు డల్హాస్‌లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటలో నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని సంబరాల కమిటీ వివరించింది. “మనమంతా తెలుగు -మనసంతా వెలుగు” ఇతివృత్తం ఆధారంగా సంబరాలు జరుగనున్నాయని తెలిపింది. శుక్రవారం ఆర్పీ పట్నాయక్, శనివారం మనో, ఆదివారం కీరవాణి.. ఇలా వరుసగా సంగీత కచ్చేరీలు, శివారెడ్డి మిమిక్రీ, అందరినీ అలరించడానికి మిల్కీ బ్యూటీ తమన్నా, ఇంకా తెలుగు వారి ఆనందం కోసం వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అందరినీ ఉత్తేజపరిచే డ్యాన్సులతో ఈ సంబరాలు అంబరాన్నంటేలా జరగనున్నాయని సంబరాల కమిటీ వివరించింది. రుచికరమైన తెలుగు వంటకాలు, ఉత్తమ సాహితీ వేత్తలతో సాహితీ మకరందాలను పంచే కార్యక్రమాలు జరుగున్నాయని తెలిపింది. టికెట్ల కోసం www.sambaralu.org ను సంప్రదించవచ్చని పేర్కొంది. మే ఒకటో తేదీ లోపు టిక్కట్లు కొన్నవారికి ముప్పై శాతం డిస్కౌంట్ ఉన్నట్లు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. 6వ అమెరికా సంబరాల కమిటీ కన్వీనర్ కిశోర్ కంచెర్ల, కమిటీ జాయింట్ కన్వీనర్ విజయ శేఖర్ అన్నె, వైస్ కన్వీనర్లు ఆది గెల్లి, ప్రేమ్ కలిదిండి, రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ డైరెక్టర్), భాను లంక (ఆతిథ్య నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల డైరెక్టర్), రామిరెడ్డి బండి (కార్యక్రమ డైరెక్టర్), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలియజేశారు... సంబరాల్లో తెలుగువారంతా పాలుపంచుకోవాలని కోరారు. -
అభాగ్యుల ఆకలి తీర్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం
-
అభాగ్యుల ఆకలి తీర్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం
బోస్టన్ : భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరోసారి నిరూపించింది. నాట్స్ బోస్టన్ చాప్టర్ ద్వారా మిత్రుల సహకారంతో శ్రీని గొండి గారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారుగా 500 పౌండ్ల ఆహార పదార్థాలను వోర్సెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ ద్వారా ఆకలితో ఉన్న అభాగ్యులకు అందించింది. -
నాట్స్ ఆధ్వర్యంలో ‘ట్రస్ట్ అండ్ విల్’
టెంపా: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నార్త్ అమెరికా తెలుగు సోసైటీ(నాట్స్) తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ చాప్టర్ ట్రస్ట్ అండ్ విల్ అనే సదస్సును నిర్వహించింది. ఆస్తులకు సంబంధించిన వీలునామాలు, బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించేటప్పుడు నామినీల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తులు తమ వారసులకు ఎలా సంక్రమించాలి అనే కుటుంబ న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు డెనీస్.ఎస్.మెజస్ హజరయి సందేహాలు తీర్చారు. ఆరోగ్యం, రక్షణ, జాగ్రత్తలుపై కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది. డా.పరిమి, ప్రశాంత్ పిన్నమనేని లు అటార్నీ డెనీస్.ఎస్. మెజస్ ను మెమెంటో తో సత్కరించారు. ఈ సదస్సును నిర్వహించినందుకు టెంపా టీంని నాట్స్ అభినందించింది. నాట్స్ టెంపా ఛాప్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మల్లాది ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు స్థానిక తెలుగు వారితో పాటు, అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సదస్సుకు నాట్స్ చైర్మెన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ప్రెసిడెండ్ మోహన్ మన్నన, నాట్స్ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు కొత్త శేఖరం, నాట్స్ టెంపా ఛాప్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మల్లాది, టెంపా నాట్స్ చాప్టర్ కార్యదర్శి ప్రసాద్ కొసరాజు, నాట్స్ సభ్యులు శ్రీనివాస్ నన్నపనేని, రమేష్ కొల్లి, శ్యాం తంగిరాల, యుగంధర్ మునగాల, మధు తాతినేని, సుధీర్ మిక్కిలినేని, మాలినీ రెడ్డి, రమా కామిశెట్టి, శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ గౌరవెల్లి, శ్రీనివాస్ అచ్చిరెడ్డి పలువురు నాట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అమెరికాలో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్‌కు సన్మానం
న్యూయార్క్: డెట్రాయిట్ యూఎస్ఏ స్థానిక ఐలాండ్ లేక్స్ అఫ్ నోవి సమావేశమందిరంలో తెలుగు సాహితీవేత్తలు, అభిమానులు, తెలుగు సంస్థల నాయకుల సమక్షంలో లయోల కళాశాల పూర్వ విద్యార్థులు డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ని సన్మానించారు. పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పూర్వ విద్యార్థి, నాట్స్ నాయకులు శ్రీని కొడాలి నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మి ప్రసాద్ ని ప్రముఖ వైద్యులు, గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల అధ్యక్షులు డా. ముక్కామల అప్పారావు సత్కరించారు. పురప్రముఖులు కాట్రగడ్డ నరసింహారావు చేతుల మీదుగా లక్ష్మి ప్రసాద్ కి జ్ఞాపికని అందచేశారు. డా. ముక్కామల అప్పారావు ప్రసంగిస్తూ.. లక్ష్మి ప్రసాద్ తో తనకున్న మూడు దశాబ్దాల పరిచయం, ఆయన ఒక మామూలు వ్యక్తిగా జీవితం ప్రారంభించి, అకుంఠిత దీక్షతో సాహితీ సేవద్వారా పద్మభూషణుడైన ప్రస్థానాన్ని సభికులకు వివరించారు. నాట్స్ డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లక్ష్మి ప్రసాద్ గారి విజయానికి ఆయన సాధించిన అవార్డులు గీటురాయి అన్నారు. తానా మాజీ అధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య చౌదరి తన ప్రసంగంలో, లక్ష్మి ప్రసాద్ చేసిన హిందీ, తెలుగు బాషలలో రచనలు వివరిస్తూ వివిధ భాషలపైనా ఆయనకి ఉన్నపట్టుని వివరించారు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు . తానా మాజీ బోర్డు అఫ్ డైరెక్టర్ డా. యడ్ల హేమ ప్రసాద్ జై ఆంధ్ర ఉద్యమంలో తాను చూసిన ఒక యువకుడు నేడు పద్మభూషణుడిగా మన ముందు నిలబడటం కృషితో మనిషి సాధించలేనిది ఏమీ లేదు అన్నది మరొకమారు నిరూపితమైనది అన్నారు. డా. లక్ష్మి ప్రసాద్ తన ప్రసంగంలో తన శిష్యులు ప్రపంచంలో అన్ని దేశాలలో వున్నారు, వారి ప్రగతి ని చూస్తుంటే తనకి చాలా సంతోషంగా ఉంటుంది, జీవితం సార్ధకం అనిపిస్తూ ఉంటుంది అన్నారు. తెలుగులో ఎంతో మంది కవులు, గొప్ప రచయితలు వున్నారు, తనకి దక్కిన ఈ గౌరవం భగవంతుడి వరంలా భావిస్తూ వుంటాను, చివరివరకు తెలుగు భాషకి సేవ చేయాలన్నదే తన అభిమతమని తెలిపారు. నాట్స్ చేస్తున్న ఈ కార్యక్రమాలు వారి 'భాషే రమ్యం, సేవే గమ్యం' ఆశయానికి నిదర్శనం అని కొనియాడారు. డా. రాఘవేంద్ర చౌదరి, నాట్స్ నేషనల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ కృష్ణ కొత్తపల్లి, డీటీఏ అధ్యక్షులు హర్ష, వేణు సురపరాజు, వినోద్ కుకునూర్ తదితరులు ప్రసంగించారు. డా. సాయి రమేష్ బిక్కిన, డా. సురేష్ అన్నే, డా. సుధ, డా. ఉష , డా. అరుణ బావినేని, డా. సునీల్ కోనేరు, డా. శ్రీదేవి, డా. విజయ, ప్రముఖ నిర్మాత మైత్రి మూవీస్ అధినేత నవీన్ యెర్నేని, ద్వారకా ప్రసాద్ బొప్పన, ప్రసాద్ గొంది, వెంకట్ కొండోజు, సురేష్ పుట్టగుంట, వెంకట్ ఎక్కా, నాని గోనుగుంట్ల, మహీధర్ రెడ్డి , సుధాకర్ కాట్రగడ్డ, శ్రీనివాస్ నిమ్మగడ్డ, సాగర్ మారంరెడ్డి, తానా ఆర్వీపీ శివ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమ వ్యాఖ్యాత గా శివ అడుసుమిల్లి వ్యవహరించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బసవేంద్ర సూరపనేని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డిట్రాయిట్ నాట్స్ ప్రెసిడెంట్ కిషోర్ తమ్మినీడి, ఆర్వీపీ విష్ణు వీరపనేని, వెంకట్ కొడాలి, గౌతమ్ మర్నేని, శ్రీధర్ అట్లూరి, మోహన్ సూరపనేని, రాంప్రసాద్ చిలుకూరి, శ్రీనివాస్ వేమూరిలను అభినందించారు.