
కోవిడ్‌ని జయించిన 105 ఏళ్ల బామ్మ లూసియా డెక్లర్క్
వాషింగ్టన్ : ఒకప్పుడు రోజులు అలా ఉండేవీ ఇలా ఉండేవీ... అప్పుడు అవీ ఇవీ తిని ఆరోగ్యంగా ఉండేవాళ్లమని చెప్పే పెద్దవాళ్ల మాటలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం. కానీ వెనుకటి రోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్ల ద్వారా వందేళ్ల క్రితం వచ్చిన స్పానీష్ ఫ్లూనూ, వందేళ్ల తరువాత ప్రస్తుతం వచ్చిన కోవిడ్–19ను జయించానని చెబుతోంది 105 ఏళ్ల బామ్మ. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తోన్న లూసియా డెక్లర్క్ వయసు అక్షరాలా 105 సంవత్సరాలు. ఈ ఏడాది జనవరి 25 న ఆమె పుట్టిన రోజు కూడా జరుపుకుంది. విచిత్రంగా తన బర్త్‌డే రోజే ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. మొదట్లో కాస్త భయపడిన లూసియా తరువాత ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ఇప్పుడు కోవిడ్ బారినుంచి బయటపడ్డారు.
రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన లూసియా తన జీవిత కాలంలో ఎటువంటి జంక్ పుడ్ తీసుకోలేదని, రోజూ నానపెట్టిన కిస్‌మిస్‌లు తినడం వల్లే నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు. లూసియాకు ఇద్దరు కొడుకులు, ఐదుగురు మనవళ్లు, మనవరాళ్లు, 12 మంది మునిమనవళ్లు, మనవరాళ్లు, 11 మంది మరోతరం మునిమనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
‘‘కోవిడ్–19 విజృంభిస్తున్న తొలినాళ్లలో వయసుమళ్ళిన పెద్దవాళ్లు ఎందరో కరోనా కాటులో ప్రాణాలు కోల్పోయారు. మా బామ్మ ఆ కోవకు చెందినవారైనప్పటికీ ఆమె.. జంక్‌ఫుడ్ జోలికీ వెళ్లకుండా పసుపురంగులోని కిస్‌మిస్‌లను రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు’’ అని లూసియా 53 ఏళ్ల మనవరాలు చెప్పింది. ఇప్పటికైనా జంక్‌ఫుడ్‌ను వదిలి సంప్రదాయ వంటకాలు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకొందాం.
చదవండి: కన్ను తాకితే కరోనా వచ్చింది!
Comments
Please login to add a commentAdd a comment