సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. కదిలిస్తే విలపించే పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో అశాంతి.. తెలియని అభద్రత.. గెలిచిన వాళ్లు, మంత్రి పదవుల్లో ఉన్న వారు కూడా సంతృప్తిగా లేరు. 20 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే కనీసం ప్రశ్నించొద్దంటున్నారు. ఇలాంటి తెలంగాణ కోసమే పోరాడామా?’ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని రాజకీయ, సమకాలీన పరిస్థితులపై మాట్లాడారు. ప్రజలు ఊహించినట్టుగా తెలంగాణ లేదని, సివిల్‌వార్‌కు పరిస్థితులు దారితీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. గతం లో పార్టీ ఫిరాయింపులు లేవని తాను చెప్పలేనని, కేసీఆర్ వచ్చాక రాజకీయాలకు కళంకం తెచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment