Meet and Greet
-
ఎన్నారైల ఆధ్వర్యంలో ఘనంగా జీటీఏ తొలి వార్షికోత్సవం వేడుకలు
ఎన్నారైల ఆధ్వర్యంలో జీటీఏ తొలి వార్షికోత్సవం వేడుకలు హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో ఘనంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ వాసులతో కలిపి ఏర్పాటుచేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బండి సంజయ్‌తో పాటు పలువురు ఎమ్మేల్యేలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. శక్తివంతమైన భారత్‌ను నిర్మించడంలో GTA భాగస్వామం కావాలని కోరారు. వివిధ దేశాల్లోని తెలంగాణ వారందరిని ఒక్కచోటకు చేర్చుతున్న GTAను ఆయన అభినందించారు. తనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, ఎంతోమంది ఎన్నారైలు డబ్బు లేకపోయినా కష్టపడి పైకి వచ్చిన వాళ్లేనన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ భారత్ అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇతర దేశాల్లో చాటుతుంది తామేనని జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి తెలిపారు. ఎన్నారై తలుచుకుంటే.. ఒక రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపించగలడని ఆయన చెప్పారు. ఎన్నారైలు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసే వాళ్లు మాత్రమే కాదని జీటీఏ నిరూపించిందని ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అన్నారు. ఎన్నారైలు తలుచుకుంటే దేన్నైనా సాధించి చూపిస్తారని, వాళ్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన 150 మంది బోర్డు సభ్యులు హాజరయ్యారు. వీరిలో గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమం చైర్మన్ మల్లాడరెడ్డి, జీటీఏ అడ్వజర్ ఛైర్ రవీందర్ రెడ్డి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యోయో మీడియా సీఈవో నవీన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు బండిసంజయ్, యశశ్విని, పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఎన్నారైలు గ్రేట్ అండ్ మీట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్లకు జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
వర్జీనియాలో ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం
-
అందరికీ కంటి వైద్యం అందేలా..ప్రత్యేక సేవకు శంకర నేత్రాలయ శ్రీకారం
శంకర నేత్రాలయ దాతలు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ శంకర నేత్రాలయ యూఎస్ఏ (SN USA) అడాప్ట్-ఎ-విలేజ్ మొబైల్ సర్జికల్ యూనిట్ దాతలు డాల్లస్ మహానగరంలో డా. ప్రేమ్‌రెడ్డి గారితో కలిసి జరిపిన కార్యక్రమములో అంధత్వ నిర్మూలనకై 350,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు) భూరి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు ప్రత్యేక అతిథిగా రాగా, ఎందరో ప్రముఖ దాతలు వివిధ నగరాల నుంచి రావడం ఒక ప్రత్యేక ఆకర్షణగా జరిగింది. గత నాలుగు దశాబ్దాలుగా, శంకర నేత్రాలయ లక్షలాది మంది కంటి చూపు లేని నిరుపేదలకు దృష్టిని పునరుద్ధరించింది. శంకర నేత్రాలయ అందించే ప్రత్యేక సేవలలో ఒకటి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (మేసు - మొబైల్ ఐ సర్జికల్ యూనిట్). ఈ రంగంలో రిమోట్‌గా కంటి శస్త్రచికిత్సలు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏకైక సంస్థ శంకర నేత్రాలయ. మేసు అనేది రెండు ప్రత్యేక వాహనాలు కలిసి ఒక వైద్య శిబిరంగా మారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదవారికి ఉచిత కంటి చికిత్స చేస్తుంది. మేసు అనగా చక్రాలపై ఉన్న ఆసుపత్రి, ఇది రెండు బస్సుల్లో ఆస్పత్రి మాదిరి వైద్యం అందిస్తుంది. ఒకటి రోగి ప్రిపరేటరీ గదిగా మరొకటి ఆపరేషన్ థియేటర్‌గా పనిచేస్తుంది. ఈ బస్సుల్లో దాదాపు 25 మంది వైద్య సిబ్బంది కలిసి మారుమూల గ్రామాలకు వెళ్లి, సుమారు 2 వేల నుంచి 3 వేల మంది రోగులను పరీక్షించి, రెండు వారాల వ్యవధిలో 150 నుంచి 300 మంది రోగులకు కంటి శుక్లం శస్త్రచికిత్స చేసి, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ తర్వాత తిరిగి బేస్ ఆస్పత్రికి చేరుకుంటారు. వేరే కీలక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను బేస్ ఆసుపత్రికి పంపుతారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ అనేది శంకర నేత్రాలయ ఇండియా నిధుల సేకరణ విభాగం. ప్రతియేటా నిధులు సేకరించి భారతదేశంలో ఉన్న శంకర నేత్రాలయకు పంపుతుంది. ఇప్పటివరకు, రెండు మేసు విభాగాలు ఉన్నాయి - ఒకటి చెన్నైలో మరొకటి జార్ఖండ్‌లో. జనవరి 2023 నుంచి మూడవ మేసు యునిట్ హైదరాబాద్లోలో ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి ఏ. ఐ. జి. సంస్థ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు పూర్తి మద్దతు ప్రకటించారు. ఒక్కో మేసు యునిట్ బేస్ హాస్పిటల్ నుంచి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు వెళ్ళి కంటి శుక్ల సేవలు నిర్వహిస్తుంది. దీంతో పూర్తి తెలంగాణా ప్రాంతానికి మేసు ద్వారా ఉచిత కంటి వైద్య సేవలు నిర్వహిస్తుంది . 2023 నుంచి ఝార్ఖాండ్, హైదరాబాద్, చెన్నై నుండి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు ఏ మారుమూల ప్రాంతానికైనా ఈ వసతి లభిస్తుంది. శంకర నేత్రాల యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీ. బాలా రెడ్డి ఇందుర్తి విదేశాలలో నివసిస్తున్న భారతీయులలో అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ సేవలు పెంచడానికి ప్రశంసనీయమైన పని చేస్తున్నారు. అతని అమూల్యమైన సేవలకు ఆ సంస్థలో అత్యున్నత పురస్కారమైన శంకరరత్నను ప్రదానం చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా - నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ) కూడా ఇటీవల డల్లాస్‌లో నిర్వహించిన సమావేశంలో అతని అత్యుత్తమ సేవలను గుర్తించి, ప్రతిష్టాత్మకమైన కమ్యూనిటీ సర్వీస్ అవార్డును ప్రదానం చేసింది. శంకర నేత్రాలయ గురించి అవగాహన పెంచడానికి, శంకర నేత్రాలయ యూఎస్ఏ జులై 1, 2023న నాటా కన్వెన్షన్‌లో ప్రముఖ వైద్యుడు, పారిశ్రామికవేత్త మరియు పరోపకారి డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంని నిర్వహించింది. ఆయన ఇటీవల తన స్వస్థలమైన నెల్లూరు సమీపంలోని నిడిగుంటపాలెంలో స్పాన్సర్ చేసిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమం కంటి సమస్యలతో బాధ పడుతున్న వందలాది మంది పేద రోగుల చూపుని పునరుద్ధరించింది. బాల ఇందుర్తి, కోర్ కమిటీ సభ్యులు ఆనంద్‌బాబు దాసరి, శ్రీధర్‌రెడ్డి తిక్కవరపులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శంకర నేత్రాలయ యు. యస్. ఏ. బృందం డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమాజానికి చేసిన విశిష్ట సేవలకుగానూ ధీన బంధు పురస్కారంతో సత్కరించింది. ఈ సమావేశంలో, హైదరాబాద్, చెన్నై మరియు జార్ఖండ్‌లలో 2023, 2024లో అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి సహకరించిన శంకర నేత్రాలయ యూఎస్ఏ జట్టు మరియు మేసు దాతలను డాక్టర్ ప్రేమ్ రెడ్డి సత్కరించారు. MESU అడాప్ట్-ఎ-విలేజ్ 2023 దాతలు: డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, రమేష్ రెడ్డి వల్లూరు, ప్రసాద్ రెడ్డి మల్లు, డాక్టర్ కిషోర్ రెడ్డి రాసమల్లు, రూబీ నహర్, ఆనంద్ బాబు దాసరి. MESU అడాప్ట్-ఎ-విలేజ్ 2024 దాతలు: మూర్తి రేకపల్లి, కిరణ్ రెడ్డి పాశం, కరుణాకర్ ఆసిరెడ్డి, కృష్ణదేవ్ రెడ్డి లట్టుపల్లి, డాక్టర్ చీమర్ల నరేందర్ రెడ్డి, రమేష్ చాపరాల, డాక్టర్ బాల్ టి. రెడ్డి, ఎ. జలంధర్ రెడ్డి, ప్రియా కొర్రపాటి , రవి రెడ్డి మరక, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, డా. మోహన్ మల్లం, నారాయణ రెడ్డి గండ్ర, తిరుమల రెడ్డి కుంభం, ప్రసూన దోర్నాదుల, మీనల్ సిన్హా BOXA, శ్రీని రెడ్డి వంగిమళ్ల, సతీష్ కుమార్ సెగు, రాజేష్ తడికమళ్ల, చైతన్య మండల, భాస్కర్ గంటి, బాల రెడ్డి ఇందుర్తి, నారాయణరెడ్డి ఇందుర్తి, రవి ఇందుర్తి. ఈ కార్యక్రమానికి హాజరైన SNUSA ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీల బోర్డు గత ధర్మకర్తల మండలి: బాల రెడ్డి ఇందుర్తి (అధ్యక్షుడు), మూర్తి రేకపల్లి (వైస్ ప్రెసిడెంట్), శ్యామ్ అప్పాలి (జాయింట్ సెక్రటరీ), సోమ జగదీష్ (జాయింట్ ట్రెజరర్), ప్రసాద్ రాణి, శ్రీని రెడ్డి వంగిమళ్ల, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, ఆనంద్ బాబు దాసరి, రాజశేఖర్ రెడ్డి ఐల, మెహర్ చంద్ లంక, డాక్టర్ జగన్నాథ్ వేదుల, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఏరువరం, రాజు పూసపాటి, వినోద్ పర్ణ, ప్రియా కొర్రపాటి, రమేష్ బాబు చాపరాల, డాక్టర్ రెడ్డి ఉరిమిండి, మరియు రవి రెడ్డి మరక. నిరుపేద రోగుల చూపుని పునరుద్ధరించే ఈ ఉదాత్త కారణానికి ఇచ్చే మద్దతు అందరిచే మీట్ అండ్ గ్రీట్‌లో చాలా ప్రశంసించబడింది. ఆ సమావేశంలో పలువురు దాతలు ముందుకు వచ్చి, అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఉదార సహకారాలు పేద రోగుల జీవితాల్లో మార్పు తెస్తాయి. ఈ ఉదాత్తమైన కారణం కోసం పనిచేస్తున్న వాలంటీర్లకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తాయి. వ్యవస్థాపకుడు ఎస్వీ ఆచార్య, ఎస్ఎన్ ఇండియా వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ఎస్ బద్రినాథ్, చెన్నై నాయకత్వం డాక్టర్ గిరీష్ రావు, డాక్టర్ సురేంద్రన్, కన్నన్ నారాయణన్, రామచంద్రన్ గోపాల్, సురేష్ కుమార్‌లకు నిరంతర మద్దతు కోసం ధన్యవాదాలు. కోర్ కమిటీ సభ్యులు బాలారెడ్డి ఇందుర్తి, ఆనంద్ బాబు దాసరి, శ్రీధర్ రెడ్డి తిక్కవరపులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మూర్తి రేకపల్లి, శ్యామ్ అప్పల్లి, వంశీ కృష్ణ ఏరువరం, సోమ జగదీష్, నారాయణరెడ్డి ఇందుర్తి, వినోద్ పర్ణ, మీనల్ సిన్హా, తీగరాజన్, దీనదయాళన్ మరియు కులతేజలకు ధన్యవాదాలు. (చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు) -
టార్గెట్ 175.. అమెరికాకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వైఎస్సార్సీపీ అమెరికా విభాగం ఆధ్వరంలో పార్టీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ అమెరికాలో పర్యటించనున్నారు. జులై 1న డల్లాస్‌లో జులై 8న వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో పాల్గోనున్నారు. దీంతో పాటు వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. 2011 పార్టీ స్థాపించిన నాటి నుంచి వైఎస్సార్సీపీకి అన్ని విధాలుగా ఎన్నారైలు అండగా నిలిచారు. తొలి నుంచీ పార్టీ సోషల్ మీడియా పటిష్టంగా ఉండడంలో వారు ముఖ్య పాత్ర పోషించారు. వారందరినీ నేరుగా కలవడంతో పాటు పార్టీ సోషల్ మీడియా బలోపేతం చేసే అంశంపై సజ్జల భార్గవ్ ఈ కార్యక్రమం ద్వారా దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చి తమ మద్దతు తెలిపేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా బలోపేతానికి ఈ కార్యక్రమం కీలకం కానుంది. విలువలు మరిచి దిగజారిన విపక్షం! ఆంధ్రప్రదేశ్ లో వేడేక్కిన రాజకీయం, పొంచిఉన్న కుట్రలను ఎదుర్కొవాల్సిన సమయం, వైఎస్సార్ సైనికులు జాగృతం కావాల్సిన సందర్భం !అమెరికాలో YSRCP కార్యకర్తలను కలిసేందుకు వస్తున్న సజ్జల భార్గవ్ కు స్వాగతం!@SajjalaBhargava pic.twitter.com/veqKBzM0pa— Kadapa Rathnakar (@KadapaRathnakar) June 27, 2023 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే వైఎస్సార్సీపీ అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు భిన్నంగా ఎన్నికల వేళ వైఎస్సార్సీపీకి భారీగా లబ్ది చేసేదే. ప్రజలు ప్రభుత్వాన్ని అడగకుండానే ప్రభుత్వమే ఎవరైనా మిగిలిపోయారా అని జల్లెడ పట్టి వారిని లబ్ధిదారుల లిస్టులోకి చేర్చడమే ఈ కార్యక్రమం ఎజెండా. అంటే ఒకరకంగా వైఎస్సార్సీపీ ఓట్ షేర్ ప్రాబబిలిటీని కన్సాలిడేట్ చేసే కార్యక్రమం. మరో వైపు వరుస సర్వేలు, సమీక్షలు, రాజకీయ సమీకరణాలను విశ్లేషించుకోవడంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతకంటే ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు. రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్‌తో ముందుకెళ్తోన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా.. నూతన సారధ్యంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం భిన్నంగా ముందుకెళ్తోంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలను సోషల్ మీడియాలో యాక్టివ్ చేసేందుకు నేరుగా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం పార్టీ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎన్ని ఉన్నా పక్కనబెడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కోసం సోషల్ మీడియాలో 2019 తరహా ఉధృత పోరాటం చేసేందుకు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జగన్ ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఒపీనియన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అన్ని మాధ్యమాలలో పోస్టులు చేయడంతో పాటు వైఎస్సార్సీపీ వ్యతిరేక పోస్టులపై కామెంట్ల రూపంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. న్యూట్రల్ పోస్టుల్లో కూడా వైయస్ జగన్ ను సమర్ధిస్తూ కామెంట్లు చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇది ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న జగన్ గ్రాఫ్ కు ఒక కొలమానంగా చూడాలి. గతంలో అయినా.. ఇప్పుడు అయినా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బలం.. ఆర్గానిక్ రీచ్. ఇతర పార్టీలకు వైఎస్సార్సీపీకి తేడా ఇదే. బడుగు బలహీన వర్గాలు వైఎస్సార్సీపీకి క్షేత్ర స్థాయిలోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం స్వచ్చందంగా పనిచేసేవారున్నారు. వారిలో చాలా మందికి పార్టీతో సంబంధాలు ఉండవు. పోస్టులు పెట్టడం, మంచి పోస్టులు ఎక్కువమందికి చేరేలా షేర్ చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు. పార్టీ ఫ్రంట్ లైన్ సోషల్ మీడియా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా. తద్వారా గ్రామ స్థాయి వరకు సోషల్ మీడియాలో జగన్ వేవ్ మరోసారి తీసుకొచ్చేలా.. జగన్నినాదం గ్రౌండ్ లెవెల్ లో మారుమోగేలా ఆ పార్టీ వ్యూహాలను అమలు చేస్తుంది. -
అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు. రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి , శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్‌కు లవ్ లెటర్స్
న్యూజెర్సీ: ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ఆండ్ గ్రీట్‌లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని,ఈ ఆవకాశం కల్పించిన ఉమానియా టీంకి దుల్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను ఉత్సాహంగా నిర్వహించారు. 600లకుపైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నారైల మధ్య చిత్రయూనిట్ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో UBlood app గురించి వివరించారు. యాప్ ఫౌండర్ జై యలమంచిలి. రక్తదానం, అలాగే రక్త గ్రహీతల పూర్తి సమాచారంతో అద్భుతమైన యాప్ ని సృష్టించిన జై యలమంచిలి పై ప్రశంసలు కురిపించారు హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ ఈవెంట్లో అధిక సంఖ్యలో పాల్గొన్న యువతకు స్పెషల్ టాస్క్ ఇవ్వడం ప్రత్యకేంగా నిలిచింది. హీరో దుల్కర్ సల్మాన్ కు - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కు లవ్ లెటర్ రాసి ఇంప్రెస్ చేయమని యూత్‌ను మరింత ఉత్సాహపరిచారు. యాంకర్ ఉదయభాను. దీంతోపాటు చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అలరించింది. ఈ సినిమాలోని ఒక పాటను పాడిన చిన్నారి ఈషాన్వి ని డైరెక్టర్ హను రాఘవపూడి అభినందించారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమానికి U-BLOOD, JAI SWARAJYA, JSW TV, బాలజీ ప్లవర్స్, కోరల్ బీడ్స్.. గ్రాండ్ స్పాన్సర్ చేశారు. ఈ మీట్ ఆండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్‌కు సహకరించిన ,గ్రాండ్ స్పాన్సర్స్ , మిగతా స్పాన్సర్లుకి ,ప్రేక్షకులందరికి ఉమానియా టీమ్ తరపున లక్ష్మీ దేవినేని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
తెలంగాణలో ఏదో ‘అశాంతి’ : రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. కదిలిస్తే విలపించే పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో అశాంతి.. తెలియని అభద్రత.. గెలిచిన వాళ్లు, మంత్రి పదవుల్లో ఉన్న వారు కూడా సంతృప్తిగా లేరు. 20 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే కనీసం ప్రశ్నించొద్దంటున్నారు. ఇలాంటి తెలంగాణ కోసమే పోరాడామా?’ అని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని రాజకీయ, సమకాలీన పరిస్థితులపై మాట్లాడారు. ప్రజలు ఊహించినట్టుగా తెలంగాణ లేదని, సివిల్‌వార్‌కు పరిస్థితులు దారితీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. గతం లో పార్టీ ఫిరాయింపులు లేవని తాను చెప్పలేనని, కేసీఆర్ వచ్చాక రాజకీయాలకు కళంకం తెచ్చారన్నారు. -
అట్లాంటాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
అట్లాంటా : అమెరికాలోని గాంధీ ఫౌండేషన్, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో 2018 మార్చి 17న (శనివారం) సాయంత్రం అట్లాంటాలోని కింగ్ సెంటర్ ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మీట్&గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ తెలుగుచలనచిత్ర, రంగస్థల నటుడు తనికెళ్ళ భరణి, ఆకాశవాణి దూరదర్శన్ వ్యాఖ్యాత పోణంగి బాలభాస్కర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇండియా ట్రిబ్యూన్ పత్రిక ఎడిటర్ రవి పోణంగి అతిధులను పరిచయం చేశారు. అనంతరం శిల్ప, మహాత్మాగాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో, రఘుపతి రాఘవ రాజారామ్ గీతాలను ఆలపించారు. గాంధీ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంథోనీ థాలియా తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. గాంధీ విగ్రహం ప్రతిష్టించి 20 సంవత్సరాలైందనీ, ప్రతీ ఏటా వివిధ దేశాలకు చెందిన దాదాపు మిలియన్‌కు పైగా ప్రజలు ఈ విగ్రహాన్నిసందర్శిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ అహింసను వజ్రాయుధంగా చేసుకుని ఉద్యమాలు చేసిన ఇద్దరు మహాపురుషుల స్మారక కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పోణంగి బాల భాస్కర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ మార్టీన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో నల్లజాతీయుల విముక్తి కోసం పోరాడి విజయం సాధించడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. అనంతరం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమీపంలో ఉన్న గాంధీ మ్యూజియం, కింగ్ జన్మించిన గృహం, కింగ్ పనిచేసిన ప్రార్ధనామందిరం (చర్చి), కింగ్ సెంటర్లను సందర్శించారు. -
ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి!
సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ మీడియాతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... నేను రెండు నెలలపాటు కర్ణాటక మీడియాలో పనిచేశానని చెప్పారు. కానీ ప్రస్తుతం నాకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదన్నారు. రాజకీయాలకు నేను కొత్త కావునా.. నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి అని ఆయన అన్నారు. మీడియా వల్లే నేను ఇంతవాడినయ్యానని ఈ సందర్భంగా తెలియజేశారు. రజనీ కాంత్ ఇటీవల అభిమానులతో సమావేశాల ఆఖరిరోజున తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
సాన్ అంటానియోలో 'మీట్ అండ్ గ్రీట్'
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ అంటానియో(టీఏజీఎస్ఏ) టెక్సాస్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి హాజరయ్యారు. ఔత్సాహికులైన తెలంగాణ ప్రాంత ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక కార్యచరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని టీఏజీఎస్ఏ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్ ప్రారంభించగా, అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు జగదీశ్వర్ ప్రముఖ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డిని సభకు పరిచయం చేశారు. మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కు సమన్వయకర్తగా టీఏజీఎస్ఏ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ శ్రీకాంత్ బిల్లా, పాండు కదిరే వ్యవహరించారు. జూన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడంలో భాగంగా ఇక్కడ 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించారు. టీఏజీఎస్ఏ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ దొంతుల, వంశీ గొబ్బురు, స్మరణ్ పాకాల, జి.మనోహర్, శ్రీ సంగిశెట్టి, వేణు కొలను, గంజి మల్లిక్ తో పాటు వెంకట్ పాకాల, పాండు కదిరే, వెంకట్ కొమ్మెర, హరిరెడ్డి, రమేష్ సిద్ధబత్తుల, లక్ష్మారెడ్డి దొంతుల, సుధీర్ రెడ్డి, ప్రవీణ్ అనుముల, తదితరులు 'మీట్ అండ్ గ్రీట్' పాల్గొన్నారు. -
బిగ్ సి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్ సి తమ షోరూమ్‌లలో ‘శామ్సంగ్ గెలాక్సీ నోట్ 5’ మొబైళ్లను కొనుగోలు చేసిన వినియోగదారుల కోసం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్ధ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బాలు చౌదరి మాట్లాడుతూ... తమ కస్టమర్ల సంతోషం కోసం ఎప్పటికప్పుడు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తూ.. వారికి బహుమతులను అందిస్తున్నామని... అందులోభాగంగానే ఇప్పుడు వినూత్నంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.