సాన్ అంటానియోలో 'మీట్ అండ్ గ్రీట్' | meet and greet conducted in San Antonio | Sakshi
Sakshi News home page

సాన్ అంటానియోలో 'మీట్ అండ్ గ్రీట్'

Published Sat, May 21 2016 2:10 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

సాన్ అంటానియోలో 'మీట్ అండ్ గ్రీట్' - Sakshi

సాన్ అంటానియోలో 'మీట్ అండ్ గ్రీట్'

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ అంటానియో(టీఏజీఎస్ఏ) టెక్సాస్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి హాజరయ్యారు. ఔత్సాహికులైన తెలంగాణ ప్రాంత ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక కార్యచరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని టీఏజీఎస్ఏ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్ ప్రారంభించగా, అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు జగదీశ్వర్ ప్రముఖ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డిని సభకు పరిచయం చేశారు.

మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కు సమన్వయకర్తగా టీఏజీఎస్ఏ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ శ్రీకాంత్ బిల్లా, పాండు కదిరే వ్యవహరించారు. జూన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడంలో భాగంగా ఇక్కడ 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించారు. టీఏజీఎస్ఏ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ దొంతుల, వంశీ గొబ్బురు, స్మరణ్ పాకాల, జి.మనోహర్, శ్రీ సంగిశెట్టి, వేణు కొలను, గంజి మల్లిక్ తో పాటు వెంకట్ పాకాల, పాండు కదిరే, వెంకట్ కొమ్మెర, హరిరెడ్డి, రమేష్ సిద్ధబత్తుల, లక్ష్మారెడ్డి దొంతుల, సుధీర్ రెడ్డి, ప్రవీణ్ అనుముల, తదితరులు 'మీట్ అండ్ గ్రీట్' పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement