TAGSA
-
టెక్సాస్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
టెక్సాస్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో(టీఏజీఎస్ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టెక్సాస్ రాష్ట్రంలోని సాన్ ఆంటోనియో నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఏజీఎస్ఏ అధ్యక్షుడు శ్రీ సంగిశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ నృత్యం తెలంగాణవాదులను ఎంతో అలరించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు జోహార్లు ఆర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేశ్ తన కళను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. నూతన తన గాత్రంతో తెలంగాణ ఎన్నారైలలో ఉత్సాహాన్ని తీసుకురాగా, సాన్ ఆంటోనియోకు చెందిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆవిర్భావ దినోత్సవ వేడుక పరిపూర్ణమైంది. ఎన్నారై తెలంగాణ మహిళలు బోనాలు ప్రదర్శించారు. ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ టీఏజీఎస్ఏ అధ్యక్షుడు శ్రీ సంగిశెట్టి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
సాన్ ఆంటోనియోలో సద్దుల బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ సంబరాలు విదేశాల్లో కూడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల సాన్ అంటోనియో నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో (టాగ్సా) నేతృత్వంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ఆడబిడ్డలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో కోలాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ మహా గౌరీదేవిని బతుకమ్మగా పూజించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను నీటి కొలను వరకు ఊరేంగిచి "పోయి రావమ్మా..." అంటూ నిమజ్జనం చేసి ఆ పై వెంట తెచ్చుకొన్న సద్దులు, నువ్వుల పొడి, పల్లీపొడి, కొబ్బరి పొళ్లను అందరితో పంచుకొని వీడుకోలు చెప్పారు. సాన్ ఆంటోనియోలో గత ఏడెనిమిదేళ్లుగా సంప్రదాయంగా జరుపుకొంటున్న ఈ బతుకమ్మ వేడుకలలో అతి పెద్ద సంఖ్యలో హాజరైన తెలంగాణ వాసులకు టాగ్సా కార్యవర్గ సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరపు వేడుకలు మరపు రాని అనుభవమని వర్ణించారు. -
సాన్ అంటానియోలో 'మీట్ అండ్ గ్రీట్'
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ అంటానియో(టీఏజీఎస్ఏ) టెక్సాస్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి హాజరయ్యారు. ఔత్సాహికులైన తెలంగాణ ప్రాంత ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక కార్యచరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని టీఏజీఎస్ఏ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్ ప్రారంభించగా, అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు జగదీశ్వర్ ప్రముఖ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డిని సభకు పరిచయం చేశారు. మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కు సమన్వయకర్తగా టీఏజీఎస్ఏ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ శ్రీకాంత్ బిల్లా, పాండు కదిరే వ్యవహరించారు. జూన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడంలో భాగంగా ఇక్కడ 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించారు. టీఏజీఎస్ఏ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ దొంతుల, వంశీ గొబ్బురు, స్మరణ్ పాకాల, జి.మనోహర్, శ్రీ సంగిశెట్టి, వేణు కొలను, గంజి మల్లిక్ తో పాటు వెంకట్ పాకాల, పాండు కదిరే, వెంకట్ కొమ్మెర, హరిరెడ్డి, రమేష్ సిద్ధబత్తుల, లక్ష్మారెడ్డి దొంతుల, సుధీర్ రెడ్డి, ప్రవీణ్ అనుముల, తదితరులు 'మీట్ అండ్ గ్రీట్' పాల్గొన్నారు.