ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వైఎస్సార్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వరంలో పార్టీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ అమెరికాలో పర్యటించనున్నారు. జులై 1న డల్లాస్‌లో జులై 8న వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్ వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో పాల్గోనున్నారు. దీంతో పాటు వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు.
2011 పార్టీ స్థాపించిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీకి అన్ని విధాలుగా ఎన్నారైలు అండగా నిలిచారు. తొలి నుంచీ పార్టీ సోషల్ మీడియా పటిష్టంగా ఉండడంలో వారు ముఖ్య పాత్ర పోషించారు. వారందరినీ నేరుగా కలవడంతో పాటు పార్టీ సోషల్ మీడియా బలోపేతం చేసే అంశంపై సజ్జల భార్గవ్ ఈ కార్యక్రమం ద్వారా దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చి తమ మద్దతు తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా బలోపేతానికి ఈ కార్యక్రమం కీలకం కానుంది.
విలువలు మరిచి దిగజారిన విపక్షం!
— Kadapa Rathnakar (@KadapaRathnakar) June 27, 2023
ఆంధ్రప్రదేశ్ లో వేడేక్కిన రాజకీయం,
పొంచిఉన్న కుట్రలను ఎదుర్కొవాల్సిన సమయం,
వైఎస్సార్ సైనికులు జాగృతం కావాల్సిన సందర్భం !
అమెరికాలో YSRCP కార్యకర్తలను కలిసేందుకు వస్తున్న సజ్జల భార్గవ్ కు స్వాగతం!@SajjalaBhargava pic.twitter.com/veqKBzM0pa
2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే వైఎస్సార్‌సీపీ అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు భిన్నంగా ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీకి భారీగా లబ్ది చేసేదే.
ప్రజలు ప్రభుత్వాన్ని అడగకుండానే ప్రభుత్వమే ఎవరైనా మిగిలిపోయారా అని జల్లెడ పట్టి వారిని లబ్ధిదారుల లిస్టులోకి చేర్చడమే ఈ కార్యక్రమం ఎజెండా. అంటే ఒకరకంగా వైఎస్సార్‌సీపీ ఓట్ షేర్ ప్రాబబిలిటీని కన్సాలిడేట్ చేసే కార్యక్రమం. మరో వైపు వరుస సర్వేలు, సమీక్షలు, రాజకీయ సమీకరణాలను విశ్లేషించుకోవడంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతకంటే ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు.
రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్‌తో ముందుకెళ్తోన్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా..
నూతన సారధ్యంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం భిన్నంగా ముందుకెళ్తోంది. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలను సోషల్ మీడియాలో యాక్టివ్ చేసేందుకు నేరుగా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం పార్టీ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎన్ని ఉన్నా పక్కనబెడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కోసం సోషల్ మీడియాలో 2019 తరహా ఉధృత పోరాటం చేసేందుకు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జగన్ ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఒపీనియన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా అన్ని మాధ్యమాలలో పోస్టులు చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ వ్యతిరేక పోస్టులపై కామెంట్ల రూపంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. న్యూట్రల్ పోస్టుల్లో కూడా వైయస్ జగన్ ను సమర్ధిస్తూ కామెంట్లు చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇది ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న జగన్ గ్రాఫ్ కు ఒక కొలమానంగా చూడాలి.
గతంలో అయినా.. ఇప్పుడు అయినా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా బలం.. ఆర్గానిక్ రీచ్. ఇతర పార్టీలకు వైఎస్సార్‌సీపీకి తేడా ఇదే. బడుగు బలహీన వర్గాలు వైఎస్సార్‌సీపీకి క్షేత్ర స్థాయిలోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం స్వచ్చందంగా పనిచేసేవారున్నారు. వారిలో చాలా మందికి పార్టీతో సంబంధాలు ఉండవు. పోస్టులు పెట్టడం, మంచి పోస్టులు ఎక్కువమందికి చేరేలా షేర్ చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు.
పార్టీ ఫ్రంట్ లైన్ సోషల్ మీడియా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా. తద్వారా గ్రామ స్థాయి వరకు సోషల్ మీడియాలో జగన్ వేవ్ మరోసారి తీసుకొచ్చేలా.. జగన్నినాదం గ్రౌండ్ లెవెల్ లో మారుమోగేలా ఆ పార్టీ వ్యూహాలను అమలు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment