meet and greet program
-
varalaxmi sarathkumar: కొత్త ప్రయాణం ఆరంభమైంది
‘‘హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలు చూసి నన్ను చాలా ్ర΄ోత్సహించారు. మీ ్ర΄ోత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. ముంబైకి చెందిన వ్యా΄ారవేత్త నికోలయ్ సచ్దేవ్తో వరలక్ష్మి వివాహం ఈ నెల 12న థాయ్‌లాండ్‌లో జరిగింది. బుధవారం వరలక్ష్మి–నికోలయ్ హైదరాబాద్‌లో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చె΄్పాలనే ఉద్దేశంతో నా భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చాను. నా కెరీర్ ముగిసి΄ోలేదు. నా సరికొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా భర్త ్ర΄ోత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘నా భార్య వరలక్ష్మి అద్భుతమైన నటి. తన వ్యక్తిత్వం కూడా ఉన్నతమైనది. సంస్కృతి, సంప్రదాయం, కుటుంబానికి గౌవరం ఇస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవడం నా లక్. మీరంతా తనని ఇలానే స΄ోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నికోలయ్. -
ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లో అలీ మీట్ అండ్ గ్రీట్
-
టార్గెట్ 175.. అమెరికాకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వైఎస్సార్సీపీ అమెరికా విభాగం ఆధ్వరంలో పార్టీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ అమెరికాలో పర్యటించనున్నారు. జులై 1న డల్లాస్‌లో జులై 8న వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో పాల్గోనున్నారు. దీంతో పాటు వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. 2011 పార్టీ స్థాపించిన నాటి నుంచి వైఎస్సార్సీపీకి అన్ని విధాలుగా ఎన్నారైలు అండగా నిలిచారు. తొలి నుంచీ పార్టీ సోషల్ మీడియా పటిష్టంగా ఉండడంలో వారు ముఖ్య పాత్ర పోషించారు. వారందరినీ నేరుగా కలవడంతో పాటు పార్టీ సోషల్ మీడియా బలోపేతం చేసే అంశంపై సజ్జల భార్గవ్ ఈ కార్యక్రమం ద్వారా దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చి తమ మద్దతు తెలిపేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా బలోపేతానికి ఈ కార్యక్రమం కీలకం కానుంది. విలువలు మరిచి దిగజారిన విపక్షం! ఆంధ్రప్రదేశ్ లో వేడేక్కిన రాజకీయం, పొంచిఉన్న కుట్రలను ఎదుర్కొవాల్సిన సమయం, వైఎస్సార్ సైనికులు జాగృతం కావాల్సిన సందర్భం !అమెరికాలో YSRCP కార్యకర్తలను కలిసేందుకు వస్తున్న సజ్జల భార్గవ్ కు స్వాగతం!@SajjalaBhargava pic.twitter.com/veqKBzM0pa— Kadapa Rathnakar (@KadapaRathnakar) June 27, 2023 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే వైఎస్సార్సీపీ అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు భిన్నంగా ఎన్నికల వేళ వైఎస్సార్సీపీకి భారీగా లబ్ది చేసేదే. ప్రజలు ప్రభుత్వాన్ని అడగకుండానే ప్రభుత్వమే ఎవరైనా మిగిలిపోయారా అని జల్లెడ పట్టి వారిని లబ్ధిదారుల లిస్టులోకి చేర్చడమే ఈ కార్యక్రమం ఎజెండా. అంటే ఒకరకంగా వైఎస్సార్సీపీ ఓట్ షేర్ ప్రాబబిలిటీని కన్సాలిడేట్ చేసే కార్యక్రమం. మరో వైపు వరుస సర్వేలు, సమీక్షలు, రాజకీయ సమీకరణాలను విశ్లేషించుకోవడంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతకంటే ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు. రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్‌తో ముందుకెళ్తోన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా.. నూతన సారధ్యంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం భిన్నంగా ముందుకెళ్తోంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలను సోషల్ మీడియాలో యాక్టివ్ చేసేందుకు నేరుగా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం పార్టీ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎన్ని ఉన్నా పక్కనబెడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కోసం సోషల్ మీడియాలో 2019 తరహా ఉధృత పోరాటం చేసేందుకు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జగన్ ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఒపీనియన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా అన్ని మాధ్యమాలలో పోస్టులు చేయడంతో పాటు వైఎస్సార్సీపీ వ్యతిరేక పోస్టులపై కామెంట్ల రూపంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. న్యూట్రల్ పోస్టుల్లో కూడా వైయస్ జగన్ ను సమర్ధిస్తూ కామెంట్లు చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇది ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న జగన్ గ్రాఫ్ కు ఒక కొలమానంగా చూడాలి. గతంలో అయినా.. ఇప్పుడు అయినా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బలం.. ఆర్గానిక్ రీచ్. ఇతర పార్టీలకు వైఎస్సార్సీపీకి తేడా ఇదే. బడుగు బలహీన వర్గాలు వైఎస్సార్సీపీకి క్షేత్ర స్థాయిలోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం స్వచ్చందంగా పనిచేసేవారున్నారు. వారిలో చాలా మందికి పార్టీతో సంబంధాలు ఉండవు. పోస్టులు పెట్టడం, మంచి పోస్టులు ఎక్కువమందికి చేరేలా షేర్ చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు. పార్టీ ఫ్రంట్ లైన్ సోషల్ మీడియా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా. తద్వారా గ్రామ స్థాయి వరకు సోషల్ మీడియాలో జగన్ వేవ్ మరోసారి తీసుకొచ్చేలా.. జగన్నినాదం గ్రౌండ్ లెవెల్ లో మారుమోగేలా ఆ పార్టీ వ్యూహాలను అమలు చేస్తుంది. -
ఏపీ సలహాదారులతో ఎన్ఆర్ఐల "మీట్ & గ్రీట్"
కాలిఫోర్నియా : బే ఏరియాలో కౌన్సిలర్ జనరల్ అఫ్ ఇండియా(SFO) మరియు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ సలహాదార్లతో ఎన్ఆర్ఐల "మీట్ & గ్రీట్" సమావేశం జరిగింది. కేవీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా. పీవీ నాగేంద్ర ప్రసాద్, ఏపీ సలహాదారులు రాజ్ కేసిరెడ్డి (ఐటీ) ఏపీఎన్ఆర్టీఎస్ (నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) చైర్మన్ వెంకట్ మేడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారు రాజ్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంద్రులకు ఇచ్చే పెట్టుబడి అవకాశాలను , ప్రోత్సహకాలను గురించి వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్ , పారిశ్రామిక మరియు పెట్టుబడుల రంగాలలో గల అవకాశాల గురించి వివరించారు. సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్స్ గా నియమితులైన "అబ్బవరం సురేంద్రా రెడ్డి", కిరణ్ కూచిబొట్ల , సుబ్రహ్మణ్యంరెడ్డి రెడ్డివారి, నరసింహ యాదవ్ ను, సహదేవ్ బోడెలను కేవీ రెడ్డి అభినందించారు. తెలుగు వారికి మరిన్ని సేవలు అందిస్తారని ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు. -
టీఆర్ఎస్కు మద్దతుగా ‘మీట్ అండ్ గ్రీట్’
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌లో నివసిస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ మద్దతుదారులు (కేటీఎస్‌యూకే) సోమవారం లండన్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’పేరిట కార్యక్రమం నిర్వహించారు. కేటీఎస్‌యూకే నేత నగేశ్‌రెడ్డి కాసర్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. సంస్థ సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులతో పాటు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము చేపట్టిన కార్యక్రమాల గురించి నగేశ్‌రెడ్డి వివరించారు. ‘చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం..’ అనే నినాదంతో తాము కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వివిధ దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, ఇతర నేతలు ప్రోత్సాహం ఇస్తున్నారని సంస్థ అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చేనేతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నారైల అండదండలు ఉండాలని దేవీప్రసాద్ కోరారు. కేసీఆర్ చేనేత పరిశ్రమ కోసం వినూత్న పథకాలతో కృషి చేస్తున్నారన్నారు. ఇక హైదరాబాద్‌ను అంతర్జా తీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా కృషి జరుగుతోందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐ–పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. తాను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చానని, చేనేత అభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు రామ్ చెప్యాల, శ్రీనివాస్‌రెడ్డి పింగళి తదితరులు పాల్గొన్నారు. -
టాంజ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
ఆక్లండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ్) ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఢిల్లీ అధికార ప్రతినిధి రామచంద్రు తేజావత్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆక్లండ్ విమానాశ్రయంలో టాంజ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, అడ్వైజరీ కమిటీ సభ్యులు జగన్ వడ్నాల తేజావత్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని తేజావత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తేజావత్ మాట్లాడుతూ... ఢిల్లీలో ఆయన నిర్వహించే బాధ్యతల గురించి ప్రస్తవించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు సీఎం పట్టుదలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తేజావత్ దంపతులను టాంజ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం టాంజ్ సభ్యులను తేజావత్ సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమానికి టాంజ్ జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు, సభ్యులు దయానంద్ కటకం, శ్రీనివాస్, శీసుత, విజేత, సుశాంతి, అరుణ్ ప్రకాశ్, విజయ్, గ్రీష్మ, సునీతతో పాటు టీఆర్ఎస్ పార్టీ న్యూజిలాండ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
సిడ్నీ: ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఢిల్లీ అధికార ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో ముఖాముఖి ఏర్పాటు చేశారు. స్థానిక ఎంపీ మెక్ డెర్మొట్, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ డాక్టర్ యాదు సింగ్, అచ్తింగ్ మేయర్ గురు ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఫోరం అధ్యక్షుడు అశోక్ మాలిష్, కార్యదర్శి డేవిడ్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జై తెలంగాణ నినాదంతో ప్రారంభమైంది. రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ, ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా పనిచేస్తోందని ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. తెలంగాణ పుననిర్మాణంలో ఎన్నారైలు భాగస్వామ్యం కావాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆస్ట్రేలియా టీడీఫ్ ఇంద్రసేనా రెడ్డి, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సుమేషు రెడ్డి సూర్య, తెలంగాణ జాగృతి సెక్రటరీ అనిల్ మునగాల, సిడ్నీ తెలుగు అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాస్ పిల్లమారి, ఫోరం సభ్యులు శ్రీనివాస్ టూట్కుర్, నర్సింగ్ రావు, పాపిరెడ్డి, మధు మోహన్ రావు, ప్రశాంత్ కడపర్తి, హరిణి సూర్య, రామ్ రెడ్డి, లావణ్య, గోవింద్, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల తదితరులు పాల్గొన్నారు.