ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్
సిడ్నీ: ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఢిల్లీ అధికార ప్రతినిధి రామచంద్రు తేజావత్తో ముఖాముఖి ఏర్పాటు చేశారు. స్థానిక ఎంపీ మెక్ డెర్మొట్, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ డాక్టర్ యాదు సింగ్, అచ్తింగ్ మేయర్ గురు ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
ఆస్ట్రేలియా ఫోరం అధ్యక్షుడు అశోక్ మాలిష్, కార్యదర్శి డేవిడ్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జై తెలంగాణ నినాదంతో ప్రారంభమైంది. రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ, ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా పనిచేస్తోందని ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. తెలంగాణ పుననిర్మాణంలో ఎన్నారైలు భాగస్వామ్యం కావాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆస్ట్రేలియా టీడీఫ్ ఇంద్రసేనా రెడ్డి, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వైస్ ప్రెసిడెంట్ సుమేషు రెడ్డి సూర్య, తెలంగాణ జాగృతి సెక్రటరీ అనిల్ మునగాల, సిడ్నీ తెలుగు అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాస్ పిల్లమారి, ఫోరం సభ్యులు శ్రీనివాస్ టూట్కుర్, నర్సింగ్ రావు, పాపిరెడ్డి, మధు మోహన్ రావు, ప్రశాంత్ కడపర్తి, హరిణి సూర్య, రామ్ రెడ్డి, లావణ్య, గోవింద్, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల తదితరులు పాల్గొన్నారు.