సిడ్నీ: ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన హోంశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం సిడ్నీలోని కింగ్స్ ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాయని బృందానికి ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులు, తెలంగాణ సంఘాలైన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరమ్, ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు.
హోం మంత్రి నాయని ఆస్ట్రేలియాలోని పలువురు నేతలను కలుసుకుని తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించనున్నారు. అదే విధంగా డిసెంబర్ 2న ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, అనిల్ మునగాల, ప్రదీప్ సేరి, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్, సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్, ప్రశాంత్ కడపర్తి, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలెట, భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. నాయని నర్సింహారెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ నేత సంతోష్ గుప్తా శతాబ్ది ఉత్సావాల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment