కాలిఫోర్నియా : బే ఏరియాలో కౌన్సిలర్ జనరల్ అఫ్ ఇండియా(SFO) మరియు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ సలహాదార్లతో ఎన్‌ఆర్‌ఐల "మీట్ & గ్రీట్" సమావేశం జరిగింది. కేవీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా. పీవీ నాగేంద్ర ప్రసాద్, ఏపీ సలహాదారులు రాజ్ కేసిరెడ్డి (ఐటీ) ఏపీఎన్‌ఆర్‌టీఎస్ (నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) చైర్మన్ వెంకట్ మేడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారు రాజ్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంద్రులకు ఇచ్చే పెట్టుబడి అవకాశాలను , ప్రోత్సహకాలను గురించి వెల్లడించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్ , పారిశ్రామిక మరియు పెట్టుబడుల రంగాలలో గల అవకాశాల గురించి వివరించారు. సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ కోఆర్డినేటర్స్ గా నియమితులైన "అబ్బవరం సురేంద్రా రెడ్డి", కిరణ్ కూచిబొట్ల , సుబ్రహ్మణ్యంరెడ్డి రెడ్డివారి, నరసింహ యాదవ్ ను, సహదేవ్ బోడెలను కేవీ రెడ్డి అభినందించారు. తెలుగు వారికి మరిన్ని సేవలు అందిస్తారని ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు.
ఏపీ సలహాదారులతో ఎన్‌ఆర్‌ఐల "మీట్ & గ్రీట్"
Published Sat, Feb 27 2021 1:59 PM | Last Updated on Sun, Feb 28 2021 9:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment