USA: ప్రియురాలిని చంపిన ఎన్‌ఆర్‌ఐ.. తర్వాత ఏం జరిగిందంటే? | Indian American Man Arrested For Murdering Girlfriend | Sakshi
Sakshi News home page

USA: ప్రియురాలిని చంపిన ఎన్‌ఆర్‌ఐ.. తర్వాత ఏం జరిగిందంటే?

Published Sun, Aug 27 2023 8:51 AM | Last Updated on Sun, Aug 27 2023 11:16 AM

Indian American Man Arrested For Murdering Girlfriend - Sakshi

న్కూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న గొడవకే తన ప్రియురాలిని గన్‌తో కాల్చి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలో భారత సంతతి సిక్కు వ్యక్తి సిమ్రన్‌జీత్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. సిమ్రన్‌జిత్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలోని క్యాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు. శనివారం తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరూ కొద్దిసేపు సరదాగా గడిపారు. ఆ తర్వాత షాపింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా పార్కింగ్‌లో ఉన్న కారు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన సిమ్రన్‌జిత్ సింగ్ కారులో నుంచి తుపాకీ తీసి తన గర్ల్‌ఫ్రెండ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

ఆవేశంలో ఆమెను చంపిన సిమ్రన్‌జీత్‌ సింగ్‌ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఇక, డెడ్‌బాడీ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ స్టోర్ వద్ద అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలో గన్‌ కల్చర్‌ మరింత పెరిగిపోయింది. కొందరు దుండగులు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడుతున్నారు.

ఇది కూడా చదవండి: సౌదీలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఎన్నారై కుటుంబం మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement