
సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ మీడియాతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... నేను రెండు నెలలపాటు కర్ణాటక మీడియాలో పనిచేశానని చెప్పారు. కానీ ప్రస్తుతం నాకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదన్నారు. రాజకీయాలకు నేను కొత్త కావునా.. నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి అని ఆయన అన్నారు. మీడియా వల్లే నేను ఇంతవాడినయ్యానని ఈ సందర్భంగా తెలియజేశారు. రజనీ కాంత్ ఇటీవల అభిమానులతో సమావేశాల ఆఖరిరోజున తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.