న్యూజెర్సీ: ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ఆండ్ గ్రీట్‌లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని,ఈ ఆవకాశం కల్పించిన ఉమానియా టీంకి దుల్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను ఉత్సాహంగా నిర్వహించారు.
600లకుపైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నారైల మధ్య చిత్రయూనిట్ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో UBlood app గురించి వివరించారు. యాప్ ఫౌండర్ జై యలమంచిలి. రక్తదానం, అలాగే రక్త గ్రహీతల పూర్తి సమాచారంతో అద్భుతమైన యాప్ ని సృష్టించిన జై యలమంచిలి పై ప్రశంసలు కురిపించారు హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ ఈవెంట్‌లో అధిక సంఖ్యలో పాల్గొన్న యువతకు స్పెషల్ టాస్క్ ఇవ్వడం ప్రత్యకేంగా నిలిచింది. హీరో దుల్కర్ సల్మాన్ కు - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కు లవ్ లెటర్ రాసి ఇంప్రెస్ చేయమని యూత్‌ను మరింత ఉత్సాహపరిచారు. యాంకర్ ఉదయభాను. దీంతోపాటు చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అలరించింది. ఈ సినిమాలోని ఒక పాటను పాడిన చిన్నారి ఈషాన్వి ని డైరెక్టర్ హను రాఘవపూడి అభినందించారు.
కన్నుల పండువగా జరిగిన కార్యక్రమానికి U-BLOOD, JAI SWARAJYA, JSW TV, బాలజీ ప్లవర్స్, కోరల్ బీడ్స్.. గ్రాండ్ స్పాన్సర్ చేశారు. ఈ మీట్ ఆండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్‌కు సహకరించిన ,గ్రాండ్ స్పాన్సర్స్ , మిగతా స్పాన్సర్లుకి ,ప్రేక్షకులందరికి ఉమానియా టీమ్ తరపున లక్ష్మీ దేవినేని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment