Sitaram
-
నమ్మిన సిద్ధాంతం కోసం
-
మునిగే తండాలో ఇక ఉండలేం
సాక్షి, మహబూబాబాద్: ‘సారూ.. శనివారం రాత్రి వచ్చిన వరదతో చెట్టుకొకరం.. పుట్టకొకరం అయినం. ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నం.. ఇట్టా మునిగే తండాలో ఉండలేం.. మాకు వేరేచోట ఇళ్లు కట్టించి ఇవ్వండి.. తండా అంతా అక్కడే ఉంటాం..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట మహ బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు సీతారాం తండావాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం తండాకు వచి్చన సీఎం స్థానికులతో మాట్లాడారు. సీఎం: నీ పేరు ఏం పేరు...? తండావాసీ: నాపేరు మంగీలాల్ సార్..సీఎం: ఏం జరిగింది? ఎక్కడివరకు నీళ్లు వచ్చాయి? (ఇల్లు చూపిస్తూ) మంగీలాల్: శనివారం రాత్రి అందాజ 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఏంది అని చూడగానే బయట అంతా కొండ మాదిరిగా నీళ్లతో ఉంది. నా భుజాల వరకు నీళ్లు వచ్చేశాయి. వెంటనే మేము పిల్లల్ని తీసుకుని పెద్ద బిల్డింగ్, ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం..ఇక ఇక్కడ ఉండలేం సార్.. మాకు వేరే ఇల్లు కట్టించండి. సీఎం: శీనన్నా (పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి) వీళ్లను చూడు. ఈ ఇల్లు మీరే కట్టుకున్నారా? (మళ్లీ మంగీలాల్‌ను ఉద్దేశించి) మంగీలాల్: లేదు సార్.. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కట్టుకున్నాం. సీఎం: ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. ఇక్కడే ఉంటారా.. వేరే చోటుకు వెళ్తారా? కలెక్టర్ గారూ అంతా చూడండి. తండా మొత్తం నమోదు చేసుకోండి. మంచి సైట్ చూడండి. ఇంట్లో ఏం తడిసినయి? ఏం ఇబ్బంది జరిగింది? మంగీలాల్ కొడుకు: సార్ నా పుస్తకాలు తడిసినయి.. ఈ ఇంట్లో ఉండలేము. మళ్లీ మునుగుతాం.. మాకు వేరే ఇల్లు కావాలి. మంగీలాల్: బియ్యం, బట్టలు అన్నీ తడిసినయ్ సార్ సీఎం: ఈమె తెలుసా? (సీతక్కను చూపిస్తూ) ఈమె నీకు కావాల్సిన పుస్తకాలు కొనిస్తుంది.. ఈయన తెలుసా? (ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ను చూపిస్తూ) ఈయన పెద్ద డాక్టర్. ఈయన మాదిరిగానే మంచిగా చదువుకోవాలి.. అధైర్య పడకండి.. అన్నీ చూసుకుంటాం. -
సీతారామం హీరోయిన్ మృణాల్ ధరించిన చీర ధర తెలిస్తే షాకవ్వుతారు!
‘సీతారామం’తో తెలుగు తెరపై తళుక్కుమన్న మృణాల్ ఠాకూర్.. తొలి సినిమాతోనే హోమ్లీ లుక్ – యాక్టింగ్ స్కిల్‌తో వరుస ఆఫర్లు అందుకుంటూ.. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో దూసుకుపోతోంది. ట్రెండ్‌కి తగట్టు స్టయిల్‌నూ మారుస్తూ ఫ్యాషన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్లోని కొన్ని ఇక్కడ.. అన్మోల్.. 1986, ముంబైలో ఇశూ దత్వానీ ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘అన్మోల్.’ అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌తో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. నలభై ఏళ్లుగా వారి వ్యాపారం అదే జోరుతో సాగుతోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ నగరాల్లోనూ దీనికి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఈ అన్మోల్ జ్యూలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. గోపీ వేద్ చిన్ననాటి స్నేహితులిద్దరి ఆలోచనల ఫ్యూజనే ‘గోపీ వేద్’ లేబుల్. గోపీ వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. డాక్టర్ అర్నాజ్.. ఈఎన్టీలో గోల్డ్ మెడలిస్ట్. డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంట్రస్ట్ ఇద్దరినీ కలిపింది. అలా కలసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. గోపీ వేద్.. డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే, అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, సృజన మిశ్రమంతో ‘గోపి వేద్’ కళాత్మాకమైన లేబుల్గా ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. కాస్త సరసమైన ధరలకే కోనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయడం నాకిష్టం. నా లుక్స్‌కు, ఈవెంట్స్‌కు తగ్గట్టుగా కొత్తకొత్త ట్రెండ్స్ ట్రై చేస్తుంటా. అయితే, ఆ ఫ్యాషన్ డిజాస్టర్ కాకుండా చూసుకుంటా. ఎన్ని వచ్చినా.. చీరకట్టులోనే నేను కంఫర్ట్‌గా ఉంటా. అదే నా ఫేవరెట్ ఫ్యాషన్. – మృణాల్ ఠాకూర్ (చదవండి: యానిమల్ చిత్రంతో ఓవరనైట్ స్టార్ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే!) -
అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?
ఈ నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు ఒకటి బయటపడింది. సరిగ్గా ఏప్రిల్ 18, 1967న శ్రీరామ నవమి (రాముడి పుట్టినరోజు) సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్‌పై నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ్ సంవత్ 2024 సంవత్సరం ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1967లో విడుదలైన ఈ స్టాంప్‌పై ఈ ఏడాది రాసి ఉంది. అలాగే హిందువులు అనుసరించే విక్రమ్ సంవత్, గ్రెగోరిన్ క్యాలెండర్ కంటే 57 ఏళ్లు ముందుంటుంది. సరిగ్గా అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఈ స్టాంప్ బయటపడటం రకరకాల ఊహాగానాలుకు తెరతీసింది. అంతేగాదు ఇప్పుడు అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవాన్ని నేపాల్ 57 ఏళ్ల క్రితమే ఊహించిందా?.. అంటూ చర్చలకు దారితీసింది. అదికూడా సరిగ్గా ఈ టైంలో వెలుగులోకి వచ్చిన ఈ స్టాంప్‌పై ఉన్న సంవత్సరం ఈ ఏడాదిని పోలి ఉండటం అందర్నీ ఆలోచింపచేసేలా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ స్టాంప్ విడుదలైన సంవత్సరం ఆలయ ప్రతిష్టాపన సంవత్సరంతో సరిపోలింది. 2024లో రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకి తిరిగి వస్తాడని 57 ఏళ్ల కిత్రం నేపాల్‌లో ఈ స్టాంప్ విడుదలైనప్పుడు ఎవరూ ఊహించి ఉండరు కదా!. ఇదిలా ఉండగా, ఈనెలలో జరగనున్న రామ ప్రాణప్రతిష్టాపన కోసం 56 అంగుళాల పొడవుతో సింహగర్జనతో కూడిన డ్రమ్ అయోధ్యకు పెద్ద ఊరేగింపుగా వచ్చింది. దీన్ని ఆలయంలో ఉంచుతారు. అలాగే ఎనిమిది లోహాలతో కూడిన శంఖం కూడా ప్రాణ ప్రతిష్టాపన సమయంలో బాల రాముడి పాదాల వద్ద ఉంటుంది. ఈ శంఖాన్ని అలీఘర్ నివాసి విరాళంగా ఇచ్చారు. కాగా, ఈ నెల 22న జరగనున్న భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు ఏడు వేల మంది ప్రముఖ ఆహ్వానితులలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు ఉన్నారు. (చదవండి: రూ. 500 నోట్లపై శ్రీరాముడ ముఖచిత్రం..వైరల్) -
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక భూమిక పోషిస్తోందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారామ్ అన్నారు. ఈ క్రమంలోనే సాంకేతికతతో కూడిన పరిపాలన అందించడం ద్వారా ప్రజల జీవన శైలిలో సమూల మార్పులు తీసుకురావచ్చన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కళాశాలల యాజమాన్యాల సంఘం(అపెక్మా) సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారామ్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణించి కీలక సంస్కరణల దిశగా ప్రణాళిక రూపొందించిందన్నారు. 50 కోట్లకు పైగా యువ శక్తితో భారత్ ప్రపంచంలో బలమైన దేశంగా ఉందన్నారు. కళాశాలల యాజమాన్యాలు సాంకేతిక విద్యలో విద్యార్థులకు లెర్నింగ్ ఔట్‌కమ్స్‌ను మెరుగుపర్చాలని కోరారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమీకృత, మల్టీడిసిప్లినరీ కోర్సులను కచ్చితంగా ప్రవేశపెట్టాలని సూచించారు. ఇప్పటికే ఏఐసీటీఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాతృభాషలోనూ సాంకేతిక విద్యను అందిస్తోందని గుర్తు చేశారు. కళాశాలల్లో ఇన్‌టేక్, అక్రెడిటేషన్ల జారీల విషయంలో రాధాకృష్ణన్ కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. కళాశాలలకు అనుమతుల ప్రక్రియను సైతం సులభతరం చేస్తున్నామని తెలిపారు. ఏటా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు.. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ గతిశక్తి కార్యక్రమంలో కీలకంగా మారనుందని సీతారామ్ తెలిపారు. ఇక్కడ లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ తదితర రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో అత్యధికంగా ఏపీ విద్యార్థులే ఉండటం తెలుగు వారి విద్యా ప్రతిభకు నిదర్శనమన్నారు. కంప్యూటర్ సైన్స్ ఒక్కటే సాంకేతిక విద్య కాదని తెలిపారు. అనేక కోర్ బ్రాంచ్‌లు, ఇతర రంగాల్లోని అవకాశాల గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. త్వరలో 1,500కు పైగా కంపెనీలతో కలిసి ప్లేస్మెంట్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత మూడేళ్లలో ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి కంపెనీల్లో సర్టిఫికేషన్లు అందించడం ద్వారా నైపుణ్య సామర్థ్యాలను పెంపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య డైరెక్టర్ నాగరాణి, అపెక్మా చైర్మన్ చొప్పా గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్‌కు లవ్ లెటర్స్
న్యూజెర్సీ: ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ఆండ్ గ్రీట్‌లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని,ఈ ఆవకాశం కల్పించిన ఉమానియా టీంకి దుల్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను ఉత్సాహంగా నిర్వహించారు. 600లకుపైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నారైల మధ్య చిత్రయూనిట్ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో UBlood app గురించి వివరించారు. యాప్ ఫౌండర్ జై యలమంచిలి. రక్తదానం, అలాగే రక్త గ్రహీతల పూర్తి సమాచారంతో అద్భుతమైన యాప్ ని సృష్టించిన జై యలమంచిలి పై ప్రశంసలు కురిపించారు హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ ఈవెంట్లో అధిక సంఖ్యలో పాల్గొన్న యువతకు స్పెషల్ టాస్క్ ఇవ్వడం ప్రత్యకేంగా నిలిచింది. హీరో దుల్కర్ సల్మాన్ కు - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కు లవ్ లెటర్ రాసి ఇంప్రెస్ చేయమని యూత్‌ను మరింత ఉత్సాహపరిచారు. యాంకర్ ఉదయభాను. దీంతోపాటు చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అలరించింది. ఈ సినిమాలోని ఒక పాటను పాడిన చిన్నారి ఈషాన్వి ని డైరెక్టర్ హను రాఘవపూడి అభినందించారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమానికి U-BLOOD, JAI SWARAJYA, JSW TV, బాలజీ ప్లవర్స్, కోరల్ బీడ్స్.. గ్రాండ్ స్పాన్సర్ చేశారు. ఈ మీట్ ఆండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్‌కు సహకరించిన ,గ్రాండ్ స్పాన్సర్స్ , మిగతా స్పాన్సర్లుకి ,ప్రేక్షకులందరికి ఉమానియా టీమ్ తరపున లక్ష్మీ దేవినేని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
వేశ్య గృహంలో రెండు వారాలు గడిపిన సీతా రామం హీరోయిన్
-
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సీతారాం అరెస్ట్
-
అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అవ్వా సీతారాం (సీతా రామారావు)ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు గుర్గావ్లో అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాం అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామారావు సోదరుడు. 2011 వరకూ అగ్రిగోల్డ్ బోర్డు మెంబర్‌గా ఉన్న ఆయన పథకం ప్రకారం బోర్డు నుంచి తప్పకున్నారు. ఇక ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టులో నిరాకరించడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులను ఎస్సెల్ గ్రూప్ కొనుగోలు చేయకుండా సీతారాం తెర వెనుక చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు సహా తొమ్మిదిమంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు. ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
సీతారాం ఏచూరిపై దాడిని ఖండిస్తూ ధర్నా
కాకినాడ సిటీ : దేశరాజధాని ఢిల్లీలో ఉన్న సీపీఎం కేంద్ర కార్యాలమైన ఏకేజీ భవన్లో పొలిట్‌బ్యూరో సమావేశాల అనంతరం మీడియా సమావేశానికి వెళుతున్న సీతారాం ఏచూరిపై హిందూసేన పేరు ఉన్న మతోన్మాదులు దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద మతోన్మాదుల ఆగడాలు నిరసిస్తూ అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జి మాట్లాడుతూ గతంలో రెండుసార్లు సీపీఎం కార్యాలయంపై దాడికి పూనుకున్నారని, తాజాగా జాతీయనేత సీనియర్ పార్లమెంటరీయన్పై దాడికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ తదితర మతోన్మాదులు రెచ్చిపోతున్నారని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రశ్నించేవారిని మట్టుబెట్టాలనుకుంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉండేదో గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎవరు ఏమి తినాలో, ఎలా ఉండాలో మతోన్మాదులకు నిర్ణయించే హక్కులేదని, రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛ, లౌకిక స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ, సీపీఐ నగర కార్యదర్శి తోకల ప్రసాద్, ఆర్పీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయితాబత్తుల రామేశ్వరరావు, లోక్‌సత్తా నాయకుడు శివరామకృష్ణ, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు మోతా కృష్ణమూర్తి, రైతు సంఘం నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సీఐటీయూ, సీపీఎం నాయకులు జి.బేబీరాణి, పలివెల వీరబాబు, సీహెచ్ అజయ్, ఎంవీ రమణ, ఎస్.భవాని, ఎం.రాజ్‌గోపాల్, సీహెచ్‌వీ రమణ పాల్గొన్నారు. -
ఫైనాన్షియర్ దౌర్జనం: మహిళకు గాయాలు
విశాఖపట్నం : తీసుకున్న బాకీ చెల్లించలేదని... మహిళను ఫైనాన్షియార్ చితకబాదాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై... ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... స్థానిక ఫైనాన్షియర్ సీతారాం వద్ద రామలక్ష్మీ అనే మహిళ గతంలో రూ. 30 వేలు తీసుకుంది. తీసుకున్న నగదు చెల్లించాలని ఆమెపై గత కొద్దికాలంగా ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ క్రమంలో బుధవారం ఉదయం ఆమెను నగదు చెల్లించాలని కోరాడు. అమె మరికొద్ది కాలం గడువు కావాలని కోరింది. దీంతో ఆగ్రహించిన సీతారాం... రామలక్ష్మిపై దాడి చేసి... చితకబాదాడు. స్థానికులు వెంటనే స్పందించి... ఆమెను ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని... రామలక్ష్మి ఫిర్యాదు స్వీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
వడదెబ్బకు ఉపాధి హామీ పథకం కూలీ మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సొరబుజ్జిలి మండలం వీరభద్రాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన అంపోలు సీతారామ్ (52) చెరువు పూడిక తీత పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో చెరువు గట్టుపై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్ఎంపీ వైద్యుడికి కబురు పెట్టగా, అతను వచ్చి సీతారామ్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. -
నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపం ధాటికి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి పలువురు అపస్మారకస్థితికి జారుకుని మృతి చెందుతున్నారు. కొద్ది రోజులుగా ఉపాధి హామీ కూలీలు మృత్యువాత పడుతున్నారు. తలమడుగు(ఆదిలాబాద్) తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలు ఎండ తీవ్రతకు తాళలేక ప్రాణాలొదిలారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సీతారాం(45), దేవరావ్(50) తోటి వారితో కలిసి పొలాల్లో ఉపాధి హామీ పనులు చేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమికి తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ధర్మవరం(అనంతపురం) ఆంధ్ర ప్రదేశ్ లోసైతం ఎండ వేడిమికి తాళలేక ఓ ఉపాధి హామీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కునుటూరు గ్రామానికి చెందిన వెంకటేశ్(65) మంగళవారం ఉపాధి పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన అతడు నీరు తాగిన కొద్దిసేపటికే చనిపోయాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. -
సొంతకాళ్లపై నిలబడదాం!
జాతీయ మహాసభలో సీపీఎం నిర్ణయం ⇒ జాతీయ స్థాయి పొత్తులు, కూటములు ఉండవు ⇒ రాష్ట్రస్థాయిలో పొత్తులపై నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే ⇒ దానికీ కొన్ని షరతులు..!! ⇒ బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రాతిపదిక ⇒ లౌకికవాదం పేరిట ఎవరితో పడితే వారితో దోస్తీకి నై ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చ (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎం ఇక ముందు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించదు. ఆ స్థానంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ప్రత్యామ్నాయానికి కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కొన్ని షరతులు విధిస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి, వామపక్ష సంఘటనకు లాభమో పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీ శాఖలకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సీపీఎం 21వ జాతీయ మహాసభల రెండో రోజైన బుధవారం రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చించారు. కాగా, ఎత్తుగడలపై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరిలు వేర్వేరు పంథాలు వెల్లడించడం గమనార్హం. కారత్ చెబుతున్న విధానం ఏమిటంటే.. ⇒ లౌకిక శక్తులతో వ్యూహాత్మక ఎత్తుగడల పేరిట ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు వద్దు. ⇒ గతం మాదిరే.. మరింత ఉధృతంగా పోరాటాలు చేద్దాం. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో మాత్రమే పొత్తులు పెట్టుకుందాం. ⇒ యూపీ, బిహార్, ఏపీలో ప్రాంతీయ పార్టీలు, ⇒ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎంతో నష్టపోయిన మాట నిజం కాదా?. ⇒ ఆ గుణపాఠాలను పరిగణనలోకి తీసుకుని పాత పద్ధతిలో పోరాటాలు చేద్దాం. ⇒ వామపక్షాలు చిన్నవా, పెద్దవా? అనే దాంతో నిమిత్తం లేకుండా ⇒ అన్ని గ్రూపుల్నీ ఏకం చేద్దాం. ⇒ కేరళలో వామపక్ష సంఘటన నుంచి ఆర్ఎస్పీ తప్పుకుని కాంగ్రెస్‌తో ⇒ కలవడం వల్ల ఎంఎ బేబీ సీటును కోల్పోవాల్సి వచ్చింది. ⇒ ఆ పార్టీ చిన్నదే కావచ్చు. మనం చెల్లించిన మూల్యం మాత్రం పెద్దది. ⇒ గత 25 ఏళ్ల అనుభవాలు చాలు. పొత్తులు వద్దు. ఇక సొంత కాళ్లపై నిలబడదాం. ⇒ స్వతంత్రంగా ఎదుగుదాం. మనమే ప్రత్యామ్నాయం అని నిరూపిద్దాం. ఏచూరి వర్గం వైఖరి ఇదీ... ⇒ వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటనకు ప్రయత్నిస్తూనే భావసారూప్యత ఉన్న ప్రాంతీయ పార్టీలనూ కలుపుకొందాం. ⇒ ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలున్న ఈ సమయంలో అందర్నీ కాదనుకుంటే ఎలా? ⇒ మనం చెబుతున్న లాటిన్ అమెరికా, గ్రీస్ తదితర దేశాల్లో సైతం కమ్యూనిస్టులు స్వతంత్రంగా అధికారంలోకి రాలేదు. ⇒ అన్ని వామపక్ష గ్రూపులు, ప్రజాస్వామి కవాదులు కలిస్తేనే అధికారం వచ్చింది. మనమూ అదే పని చేయాలి. ⇒ ప్రాంతీయ పార్టీల్లో లౌకికత్వాన్ని సమర్థించేవాటితో పొత్తుపై నిర్ణయించే స్వేచ్ఛను రాష్ట్ర కమిటీలకు ఇవ్వాలి. ⇒ అవసరం మేరకు ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండాలి. షరతులు వర్తిస్తాయి ‘సాక్షి’తో రాఘవులు ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై రాఘవులు మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై కొన్ని షరతులుంటాయన్నారు. ⇒ ప్రాంతీయ పార్టీలు, లౌకిక బూర్జువా పార్టీలతో కలసి జాతీయస్థాయిలో పొత్తులుండవు. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మాత్రమే జాతీయస్థాయిలో ఉంటుంది. ⇒ ఎన్నికల సమయంలో ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో రాష్ట్ర కమిటీలే నిర్ణయిస్తాయి. ⇒ అయితే, మతతత్వానికి దూరంగా ఉంటూ, సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించాలి. ఉద్యమాల్లో కలసిరావాలి. ⇒ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ అవకాశవాద బూర్జువా పార్టీలే. వీటికి మా ఫ్రంట్‌లో చోటులేదు. అందరూ అంగీకరిస్తున్న విధానాలు ⇒ సొంత పునాదులపైనే ఎదగాలి. వామపక్ష సంఘటనకు ప్రాధాన్యం ఉండాలి. ⇒ సైద్ధాంతిక నిబద్ధత పెరగాలి. అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలి. మధ్యతరగతిని ఆకట్టుకోవాలి. ⇒ ఎన్నికల పొత్తులనేవి వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు అనుక్రమణికగా ఉండాలే గానీ అవే ప్రధానం కాకూడదు. ⇒ ఈ ముసాయిదాపై చర్చలు గురువారం మధ్యాహ్నంతో ముగుస్తాయి. అనంతరం ప్రకాశ్ కారత్ సమాధానం ఇస్తారు. -
ప్రధాని ప్రకటన చేయాల్సిందే
మతమార్పిళ్లపై రాజ్యసభలో పట్టువీడని విపక్షం వీహెచ్ ఒకరోజు సస్పెన్షన్ సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిళ్లు న్యాయబద్ధమేనని ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీయే ఈ విషయమై రాజ్యసభలో ప్రకటన చేయాలన్న విపక్షాలు పట్టువీడలేదు. మూడో రోజూ ఈ విషయమై సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. బుధవారం కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యుల ఆందోళన కారణంగా సభ పలుమార్లు వాయిదాపడింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని, ప్రధాని వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మతమార్పిళ్లపై దేశమంతటా ఆందోళన వ్యక్తమవుతుండగా ప్రధాని మాత్రం స్పందించడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రధానమంత్రి, ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెనన్, కాంగ్రెస్ నేత అశ్వినీకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ఎంపీలు మతమార్పిళ్లపై చేస్తున్న వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని జోక్యం చేసుకుని ప్రకటన చేయాలని కోరారు. అయితే, కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు ఇదే డిమాండ్‌తో వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభాపతి స్థానంలో ఉన్నారు. ఈ సందర్భంలో ‘ప్రైం మినిస్టర్ కో బులావో’ అంటూ ఏకవచనంలో సంబోధించారని, అన్ పార్లమెంటరీ భాష వాడారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో చైర్మన్ నిబంధన 255 కింద వీహెచ్‌ను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిబంధన కింద చైర్మన్ సభ్యుడి పేరు చదివినప్పుడు ఆ రోజులో తదుపరి సమయం సభకు హాజరు కాకూడదు. ‘గుడ్‌గవర్నెన్స్’పై దద్దరిల్లిన లోక్‌సభ క్రిస్మస్ పండుగ రోజున పాఠశాలలను తెరిచి ఉంచాలనే ప్రభుత్వ ఉత్తర్వులపై లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని, సంఘ పరివార్ ఎజెండాను అమలు చేయాలని చూస్తోందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. 25న గుడ్గవర్నెన్స్పై వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఆ మేరకు వాటి వీడియోలు తీసి పంపాలని తెలుపుతూ వెలువడిన ఉత్తర్వులను కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ సభలో చదివి వినిపించారు. ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సమాధాన మిచ్చారు. క్రిస్మస్ సెలవు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదన్నారు. -
కొడుకు చేతిలో తండ్రి హతం?
విజయనగరం క్రైం:జులాయిగా తిరుగుతున్న కుమారుడి చేతిలో తండ్రి హత్యకు గురైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని ధర్మపురి గ్రామంలో నివాసముంటున్న తుమ్మగంటి సీతారాం(50) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతారాం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పో షిస్తున్నాడు. అతనికి భార్య పాపయ్యమ్మ, వికలాంగుడైన పెద్దకుమారుడు పైడినాయుడు, చిన్నకుమారుడు రమణ ఉన్నారు. రెండో కుమారుడు రమణ జులాయి గా తిరుగుతూ మద్యం ఎక్కువగా తాగుతుంటాడు. కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతుంటాడు. సీతారాం తన కళ్లంలో శాల లేకపోవడంతో పక్కనే ఉన్న కర్రి రమణ కళ్లంలో పడుకునేవాడు. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో కర్రి రమణ కళ్లంలోని శాలలో మంచంపై సీతారాం పడుకోగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుక్కిదున్నే కర్రతో సీతారాం తలపై మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయాన్నే కళ్లాల వైపు వచ్చిన స్థానికులు చూసి వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఆర్.గోవిందరావు, ఎస్సైలు ఐ. దుర్గాప్రసాద్, ఎస్.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబసభ్యులను విచారించా రు. క్లూస్ టీం సభ్యులు సత్యనారాయణ రాజు, షన్ము ఖ సంఘటనస్థలానికి వెళ్లి వేలి ముద్రలను సేకరించా రు. డాగ్ స్క్వాడ్ బృందం చెరువు సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ నుండి నేరుగా మృతుడి ఇంటికి చేరుకుంది. మృతుడి ఇంట్లో రక్తపు మరకలు ఉండడంతో చిన్న కుమారుడే తండ్రిని హత్య చేసి ఉంటాడని పోలీ సులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ పరిశీలించారు. చిన్నకుమారుడు రమణ తల్లిదండ్రులను రూ.40 వేలు అడిగినట్లు, అవి ఇచ్చేందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో రమణ మరొకరి సహాయంతో తండ్రిని హత్య చేశాడేమోనన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే తల్లిని కూడా హత్య చేసేందుకు పథకరచన చేశాడన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
వైసీపీలో చేరిన తమ్మినేని సీతారాం