‘సీతారామం’తో తెలుగు తెరపై తళుక్కుమన్న మృణాల్ ఠాకూర్.. తొలి సినిమాతోనే హోమ్లీ లుక్ – యాక్టింగ్ స్కిల్‌తో వరుస ఆఫర్లు అందుకుంటూ.. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో దూసుకుపోతోంది. ట్రెండ్‌కి తగట్టు స్టయిల్‌నూ మారుస్తూ ఫ్యాషన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లోని కొన్ని ఇక్కడ..
అన్మోల్..
1986, ముంబైలో ఇశూ దత్వానీ ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘అన్మోల్.’ అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌తో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. నలభై ఏళ్లుగా వారి వ్యాపారం అదే జోరుతో సాగుతోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ నగరాల్లోనూ దీనికి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఈ అన్మోల్ జ్యూలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
గోపీ వేద్
చిన్ననాటి స్నేహితులిద్దరి ఆలోచనల ఫ్యూజనే ‘గోపీ వేద్’ లేబుల్. గోపీ వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. డాక్టర్ అర్నాజ్.. ఈఎన్‌టీలో గోల్డ్ మెడలిస్ట్. డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంట్రస్ట్ ఇద్దరినీ కలిపింది. అలా కలసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. గోపీ వేద్.. డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే, అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, సృజన మిశ్రమంతో ‘గోపి వేద్’ కళాత్మాకమైన లేబుల్‌గా ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. కాస్త సరసమైన ధరలకే కోనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయడం నాకిష్టం.
నా లుక్స్‌కు, ఈవెంట్స్‌కు తగ్గట్టుగా కొత్తకొత్త ట్రెండ్స్ ట్రై చేస్తుంటా. అయితే, ఆ ఫ్యాషన్ డిజాస్టర్ కాకుండా చూసుకుంటా. ఎన్ని వచ్చినా.. చీరకట్టులోనే నేను కంఫర్ట్‌గా ఉంటా. అదే నా ఫేవరెట్ ఫ్యాషన్.
– మృణాల్ ఠాకూర్
(చదవండి: యానిమల్ చిత్రంతో ఓవరనైట్ స్టార్ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment