ముంబై భామ పూజా హెగ్డే నటి, మోడల్ కూడా. ఆమె స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది కూడా. బుట్టబొమ్మలా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఫ్యాషన్ విషయానికి వస్తే..స్టయిల్ అనేది మనం సెట్ చేసుకొనేదే.
ప్రత్యేకంగా ఒక ఫ్యాషన్‌నే ఇష్టపడను. ఎక్కువగా మిక్స్ అండ్ మ్యాచ్‌ను ట్రై చేస్తుంటా అని చెబుతోంది పూజా. స్టయిల్ అనేది మనం సెట్ చేసుకొనేదే.
పింక్ సిటీ బై సారికా
సారికా కాక్రానియాకు చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్ అంటే ప్యాషన్. అయితే చిన్న వయసులోనే పెళ్లి, వెంటనే ఇద్దరు పిల్లలు కలగడంతో పెళ్లయిన పదిహేడు సంవత్సరాల తర్వాత తన ప్యాషన్ కోసం పనిచేయడం మొదలుపెట్టింది. అలా 2014లో తన పేరు మీదే ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించి, అనతి కాలంలోనే స్టార్స్‌కు తన డిజైన్స్‌ను అందించే స్థాయికి ఎదిగింది. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ధర మాత్రం లక్షల్లోనే. ఆన్ లైన్ కొనుగోలు చేయొచ్చు. పూజాహెగ్డే ధరించిన పింక్ సిటీ బై సారికా చీర ధర రూ 49,850/-
అన్మోల్..
1986, ముంబైలో ఇషూ దత్వానీ ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘అన్మోల్.’ అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌లో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. నలభై ఏళ్లుగా వారి వ్యాపారం అదే జోరుతో సాగుతోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ నగరాల్లోనూ దీనికి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఈ అన్మోల్ జ్యూవెలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
--దీపిక కొండి
(చదవండి: అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!)
Comments
Please login to add a commentAdd a comment