అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, స్టైల్‌కి ఐకాన్ అయిన నటాషా పూనావాల ఎప్పటికప్పుడూ సరికొత్త ఫ్యాషన్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె స్వతహాగానే ఫ్యాషన్‌గా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆమె ఎప్పటికప్పుడూ ట్రెండ్‌ని సెట్ చేసే సరికొత్త డిజైనర్ వర్ దుస్తులతో తుళ్లక్కుమంది. అలానే ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన సమ్మర్ గాలా 2024 కోసం క్రిస్టల్స్‌తో అలంకరించిన గౌనుని ధరించింది. ఈ గాలా ఈవెంట్‌లో నటాషా ధరించిన మార్టిన్ గ్లాస్ ఆకృతి పర్సు హైలెట్‌గా నిలిచింది.
ఈ పర్సు వోడ్కా, జిన్, కాక్‌టెయిల్ వంటి జ్యూస్‌లనే సర్వ్ చేసే మార్టిన్ గ్లాస్ ఆకృతిలో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఈ పర్సు ఎక్కువగా ఆకర్షించింది. అంతేగాదు సోషల్ మీడియాలో సైతం అందుకు సంబంధించిన ఫోటోల్లో కనిపించిన ఈ పర్సే అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. ఇక్కడ నటాషా ముగ్ధమనోహరంగా ఉండేలా ట్రాన్స్‌పరేంట్ క్రిస్టల్ గౌనులో మెరిసిపోయింది. అందుకు తగ్గట్లు చేతికి ధరించిన పర్సు ఎవర్ గ్రీన్‌గా ఉంది. అంతేగాదు ఈ మార్టిన్ గాజు ఆకృతి పర్సుని క్రిస్టల్స్‌తో అలంకరించడంతో నటాషా దివి నుంచి భువి వచ్చిన దేవకన్యలా ధగ ధగ మెరిసిపోయింది.
ఈ పర్సు ఓపెనింగ్ అద్దం మాదిరిగా ఉంటుంది. జుడిత్ లీబర్ బ్రాండ్‌కి చెందిన ఈ పర్సు ధర ఏకంగా రూ. 4.85 లక్షలు పైనే ఉంటుందట. నటాషా ఎప్పుడూ డిఫెరెంట్ ఫ్యాషన్ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ సారి ఆమె ధరించి గ్లాస్ ఆకృతి పర్సు అందరి మనసులను దోచుకుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను ఈ పర్సు ఎంతగానో ఆకట్టుకుంది. అంతా వాటే ఏ స్టైలిష్ పర్సు అని ప్రశంసిస్తున్నారు కూడా.
ఎవరీ నటాషా?
భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2023 నాటికి, సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విలువ రూ. 1.92 లక్షల కోట్లుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
అంతేగాదు ఆమె సైరస్ పూనావల్ల గ్రూప్‌లోని వివిధ కంపెనీల కోసం సృజనాత్మకతతో కూడిన వ్యాపార వ్యూహాలతో లాభాల బాట పట్టించడంలో నటాషా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె తన అత్తగారి గౌరవార్థం 2012లో స్థాపించబడిన కుటుంబ ఫౌండేషన్ అయిన విల్లో పూనావల్లా ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే భారతదేశం కోసం బ్రిటీష్ ఆసియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. పైగా బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్‌కు ఇండియా అడ్వైజరీ కౌన్సిల్‌లో సభ్యురాలు కూడా.
(చదవండి: హీరోయిన్ కత్రినా అనుసరించే రెండుపూటల భోజనం, షట్పావళి డైట్ ప్లాన్ అంటే..?)
Comments
Please login to add a commentAdd a comment