కొడుకు చేతిలో తండ్రి హతం? | Father's death at the hands of his son | Sakshi
Sakshi News home page

కొడుకు చేతిలో తండ్రి హతం?

Published Wed, Aug 13 2014 1:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

కొడుకు చేతిలో తండ్రి హతం? - Sakshi

కొడుకు చేతిలో తండ్రి హతం?

 విజయనగరం క్రైం:జులాయిగా తిరుగుతున్న కుమారుడి చేతిలో తండ్రి హత్యకు గురైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం పట్టణంలోని ధర్మపురి గ్రామంలో నివాసముంటున్న తుమ్మగంటి సీతారాం(50) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతారాం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పో షిస్తున్నాడు. అతనికి భార్య పాపయ్యమ్మ, వికలాంగుడైన పెద్దకుమారుడు పైడినాయుడు, చిన్నకుమారుడు రమణ ఉన్నారు. రెండో కుమారుడు రమణ జులాయి గా తిరుగుతూ మద్యం ఎక్కువగా తాగుతుంటాడు. కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతుంటాడు.
 
  సీతారాం తన కళ్లంలో శాల లేకపోవడంతో పక్కనే ఉన్న కర్రి రమణ కళ్లంలో పడుకునేవాడు. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో కర్రి రమణ కళ్లంలోని శాలలో మంచంపై సీతారాం పడుకోగా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుక్కిదున్నే కర్రతో సీతారాం తలపై మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయాన్నే కళ్లాల వైపు వచ్చిన స్థానికులు  చూసి  వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఆర్.గోవిందరావు, ఎస్సైలు ఐ. దుర్గాప్రసాద్, ఎస్.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబసభ్యులను విచారించా రు.
 
 క్లూస్ టీం సభ్యులు సత్యనారాయణ రాజు, షన్ము ఖ సంఘటనస్థలానికి వెళ్లి వేలి ముద్రలను సేకరించా రు. డాగ్ స్క్వాడ్ బృందం చెరువు సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ నుండి నేరుగా మృతుడి ఇంటికి చేరుకుంది. మృతుడి ఇంట్లో రక్తపు మరకలు ఉండడంతో చిన్న కుమారుడే తండ్రిని హత్య చేసి ఉంటాడని పోలీ సులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ పరిశీలించారు. చిన్నకుమారుడు రమణ తల్లిదండ్రులను రూ.40 వేలు  అడిగినట్లు, అవి ఇచ్చేందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో రమణ మరొకరి సహాయంతో తండ్రిని హత్య చేశాడేమోనన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే తల్లిని కూడా హత్య చేసేందుకు పథకరచన చేశాడన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement