అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అవ్వా సీతారాం (సీతా రామారావు)ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు గుర్గావ్‌లో అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాం అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామారావు సోదరుడు. 2011 వరకూ అగ్రిగోల్డ్ బోర్డు మెంబర్‌గా ఉన్న ఆయన పథకం ప్రకారం బోర్డు నుంచి తప్పకున్నారు. ఇక ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టులో నిరాకరించడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులను ఎస్సెల్ గ్రూప్ కొనుగోలు చేయకుండా సీతారాం తెర వెనుక చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు సహా తొమ్మిదిమంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సీతారాం అరెస్ట్
Published Tue, May 22 2018 10:58 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
Advertisement