వడదెబ్బకు ఉపాధి హామీ పథకం కూలీ మృతి చెందాడు.
వడదెబ్బకు ఉపాధి హామీ పథకం కూలీ మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సొరబుజ్జిలి మండలం వీరభద్రాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన అంపోలు సీతారామ్ (52) చెరువు పూడిక తీత పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో చెరువు గట్టుపై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్‌ఎంపీ వైద్యుడికి కబురు పెట్టగా, అతను వచ్చి సీతారామ్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు.