
మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ కాంబినేషన్‌లో వచ్చిన 'సీతారామం' సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ అదరగొట్టింది. ఈ సందర్భంగా హిందీ వెర్షన్ ‘సీతారామం’ సక్సెస్ మీట్‌లో పాల్గోన్న దుల్కర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీతారామం చూసిన బి-టౌన్ ప్రేక్షకులు దుల్కర్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో పోల్చుతున్నారు. ఈ క్రమంలో సక్సెస్ మీట్‌లో ఓ విలేకరి దీనిపై దుల్కర్‌ను ప్రశ్నించగా ఆసక్తికర రితీలో స్పందించారు ఆయన. షారుక్ ఖాన్ ఒక లెజెండ్ అని.. దయచేసిన తనని ఆయనతో పోల్చవద్దని అన్నారు.
(చదవండి: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!)
‘నేను షారుక్‌కు పెద్ద అభిమానిని. నేను చిన్నప్పుడు షారుక్ సినిమాలను చూసేవాడిని. అలా చూసిన వాటిల్లో ‘దిల్‌వాలే దల్హనియా లేజాయేంగే’ నాకు చాలా ఇష్టమైన మూవీ. ఆ సినిమా చాలాసార్లు చూశాను. నాకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం వేసినప్పుడు నేను షారుక్‌ను మనసులో తలచుకుంటా. ఆయన కేవలం నటుడే కాదు ఎంతో గొప్ప వ్యక్తి. నన్ను ఆయనతో పోల్చడం నా దృష్టిలో ఆయన్ని అవమానించినట్లే. ఎందుకంటే షారుక్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు’ అంటూ దుల్కర్ తన అభిమానాన్ని చాటుకున్నారు.