Seetharam
-
బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ గా నమ్మిన వ్యక్తి సీఎం జగన్ : స్పీకర్ తమ్మినేని
-
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం బాలసాయిబాబా ట్రస్ట్ భూములను రక్షించే క్రమంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. ఈ మేరకు శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాంను జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు షిఫ్టులు పని చేసేలా నలుగురు గన్మెన్లను రక్షణగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. భూముల పరిరక్షణకు తరుచూ ఈ ప్రాంతానికి వస్తున్నానని, పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లతో తనకు ప్రాణహాని ఉన్నట్లు తెలిసిందన్నారు. మండలగూడెం రియల్టర్ల చేతిలో ఉన్న 59 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు. బాలసాయిబాబా కుటుంబ సభ్యులు ఆ భూములను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం ఉందని, భూముల వివరాలు కావాలని మూడు రోజుల కిందట సమాచార హక్కు చట్టం కింద రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓసారి తనపై హత్యాయత్నం జరిగిందని, బాలసాయిబాబా భూములను కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో రక్షణ కల్పించాలని కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంకు గద్దర్ విన్నవించారు. -
జస్టిస్ సీతారాంరెడ్డి కన్నుమూత
బంజారాహిల్స్ (హైదరాబాద్)/ఉండవెల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి (94) గురువారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో 1928 మార్చి 20వ తేదీన చిన్నారెడ్డి, వెంకట్రామమ్మ దంపతులకు జన్మించిన సీతారాంరెడ్డికి భార్య మనోరమాదేవి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1978 నుంచి 90 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1990 నుంచి 95 వరకు లోకాయుక్తగా పనిచేశారు. అలాగే 1989 నుంచి 96 వరకు ఆర్బీవీఆర్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రముఖ న్యాయవేత్త పాల్కీవాలా వద్ద ఆయన జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో లెక్చరర్‌గా కూడా పని చేశారు. 1968లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగిన ఆయన 1974లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి సమరసింహారెడ్డి, జస్టిస్ యతిరాజులు, జస్టిస్ వెంకట్రామిరెడ్డి, విశ్రాంత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా వీ.ఆర్.రెడ్డి, జస్టిస్ జీవన్‌రెడ్డి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గురువారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. -
‘ఆ స్టార్ హీరోతో నన్ను పోల్చడమంటే.. ఆయనను అవమానించినట్లే’
మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ కాంబినేషన్లో వచ్చిన 'సీతారామం' సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ అదరగొట్టింది. ఈ సందర్భంగా హిందీ వెర్షన్ ‘సీతారామం’ సక్సెస్ మీట్లో పాల్గోన్న దుల్కర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీతారామం చూసిన బి-టౌన్ ప్రేక్షకులు దుల్కర్‌ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో పోల్చుతున్నారు. ఈ క్రమంలో సక్సెస్ మీట్లో ఓ విలేకరి దీనిపై దుల్కర్‌ను ప్రశ్నించగా ఆసక్తికర రితీలో స్పందించారు ఆయన. షారుక్ ఖాన్ ఒక లెజెండ్ అని.. దయచేసిన తనని ఆయనతో పోల్చవద్దని అన్నారు. (చదవండి: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!) ‘నేను షారుక్‌కు పెద్ద అభిమానిని. నేను చిన్నప్పుడు షారుక్ సినిమాలను చూసేవాడిని. అలా చూసిన వాటిల్లో ‘దిల్వాలే దల్హనియా లేజాయేంగే’ నాకు చాలా ఇష్టమైన మూవీ. ఆ సినిమా చాలాసార్లు చూశాను. నాకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం వేసినప్పుడు నేను షారుక్‌ను మనసులో తలచుకుంటా. ఆయన కేవలం నటుడే కాదు ఎంతో గొప్ప వ్యక్తి. నన్ను ఆయనతో పోల్చడం నా దృష్టిలో ఆయన్ని అవమానించినట్లే. ఎందుకంటే షారుక్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు’ అంటూ దుల్కర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. -
అందుకే నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండరట!
‘‘వైవిధ్యమైన పాత్రల్లో ఆడియన్స్ నన్ను చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నా పాత్రల ఎంపిక ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఉండాలనుకుంటాను’’ అని అన్నారు మృణాళ్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్ప ణలో స్వప్న సినిమాపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మృణాళ్ ఠాకూర్ చెప్పిన విశేషాలు. ► ‘సీతారామం’ స్క్రిప్ట్ విన్న వెంటనే ఇందులోని సీతామహాలక్ష్మి పాత్ర చేయడానికి అంగీకరించాను. వైజయంతీ బేనర్ నిర్మించిన ‘మహానటి’ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్‌తో నాకు ముందే పరిచయం ఉంది. ‘మహానటి’ మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ అప్పుడు ఆయన్ను నేను కలిశాను. నేను హిందీలో యాక్ట్ చేసిన ‘లవ్ సోనియా’ చిత్రం అదే ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక కావడంతో వెళ్లాను. ‘మహానటి’లో కీర్తీ సురేశ్ అద్భుతంగా నటించారు. ఇలాంటి పాత్రను నేను ఎందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డాను. ►‘సీతారామం’లాంటి మంచి సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. హిందీలో నా తొలి చిత్రం ‘లవ్ సోనియా’ విడుదలైన తర్వాత నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. కానీ ‘సీతారామం’ ట్రైలర్ విడుదల తర్వాత నాకు తెలుగు, హిందీలో కొత్త ఆఫర్స్ వస్తుండటం సంతోషంగా ఉంది. హిందీలో ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్ చేశాను. ఇది తెలుగులో కూడా డబ్ అయింది. ఇందులో నా క్యారెక్టర్‌కు కాస్త రొమాంటిక్ టచ్ ఉంటుంది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘సీతారామం’ అనే రొమాంటిక్ ఫిల్మ్ చేశాను. ‘కుంకుమ భాగ్య’ సీరియల్లో నా అక్క పాత్రలో నటీమణి మధురాజా నటించారు. సీతామహాలక్ష్మి పాత్రకు ఆమెను కాస్త స్ఫూర్తిగా తీసుకున్నాను. ‘సీతారామం’ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నన్ను మృణాళ్గా కన్నా కూడా సీతగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నేను బరువు కూడా పెరిగాను. ►ఓ సినిమాకు నాలుగో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా జర్నీ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ సినిమాకు నాకు పారితోషికం కూడా అందలేదు. నేను యాక్టర్ అవుతానని అప్పట్లో ఊహించలేదు. పైగా తెలుగు హీరోయిన్ అవుతానని నేను అనుకోలేదు. రేపు నా బర్త్ డే. ‘సీతారామం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అందుకే ఈ సినిమానే నా బెస్ట్ బర్త్ డే గిఫ్ట్‌గా భావిస్తున్నాను. ►నాకు కొన్ని లవ్ లెటర్స్ వచ్చాయి (నవ్వుతూ..). కానీ ప్రజెంట్ నా ఫోకస్ అంతా ‘సీతారామం’ పైనే. ప్రమోషన్స్, షూటింగ్స్ కోసం ఇవాళ ముంబైలో ఉంటావు. రేపు హైదరాబాద్ వెళ్తావు. ఇలా ఉంటే నీకు బాయ్‌ఫ్రెండ్ ఉండరు.. ఎవరు ఉంటారు?’ అని నా స్నేహితులు సరదాగా ఆటపట్టిస్తుంటారు. ►హిందీలో నేను చేసిన ‘ఫిపా’, ‘పూజా మేరీ జాన్’ సినిమాల చిత్రీకరణలు పూర్తయ్యాయి. ఆదిత్యా రాయ్ కపూర్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. -
సినిమా కలకాలం నిలుస్తుంది – రమేశ్ ప్రసాద్
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత ఎల్వీ ప్రసాద్) మూకీ సినిమా అప్పటినుంచి సినిమాల్లో భాగమయ్యారు. ఆ విధంగా మా ప్రసాద్స్ సంస్థకి సినిమాతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో సినిమా గడ్డు పరిస్థితి ఎదుర్కొనడం చూశాం. ప్రేక్షకుల ప్రేమతో ఇండస్ట్రీ ఈ కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా కలకాలం నిలుస్తుంది. ‘సీతారామం’ టీమ్‌కి శుభాకాంక్షలు’’ అని ప్రసాద్స్ గ్రూప్ అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రలు చేశారు. 1965, 80 నేపథ్యంలో సాగే ప్రేమకథగా హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సోమవారం జరిగిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేశ్ ప్రసాద్ అతిథిగా పాల్గొన్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘అందరూ నన్ను రొమాంటిక్ హీరో అంటుంటే విసుగొచ్చి ఇక ప్రేమకథలు చేయకూడదనుకున్నాను. హనుగారు చెప్పిన ‘సీతారామం’ అద్భుతమైన ప్రేమకథ. క్లాసిక్ ఎపిక్ లవ్ స్టోరీ కాబట్టి చేశాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను చేసిన అఫ్రిన్ పాత్ర రెబల్. నా పాత్ర పై ఆడియన్స్‌కి కోపం వచ్చినా ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘ఈ చిత్రంలో మ్యాజికల్ రొమాన్స్ వుంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. సుమంత్, హను రాఘవపూడి మాట్లాడారు. -
కథ నచ్చితే విలన్‌గా రెడీ
‘‘ఒక ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్లో తొలిసారిగా ‘సీతారామం’ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా ఓ మంచి సపోర్టింగ్ రోల్ చేశాను. కథ నచ్చితే నెగటివ్ పాత్రలు చేయడానికి రెడీ’’ అని అన్నారు సుమంత్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్ చేసిన బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్ర లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ... మద్రాస్ రెజిమెంట్’’ అనే డైలాగ్ ఉంటుంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘పదహారేళ్ల క్రితం ‘గోదావరి’ చిత్రంలో సీతరాముల కథను చెప్పాం (ఈ చిత్రంలో హీరో సుమంత్ పాత్ర రామ్, హీరోయిన్ కమలినీ ముఖర్జీ పాత్ర సీత). ఇప్పుడు ఈ ‘సీతారామం’ కథలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నన్ను నటించమన్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమని హను రాఘవపూడిగారిని అడగడం జరిగింది. దాదాపు 150 పేజీల స్క్రిప్ట్‌ను చదివి, ఆ తర్వాత విష్ణు శర్మ పాత్రకు ఓకే చెప్పాను. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది. చాలా షేడ్స్ ఉన్నాయి. నెగటివ్ రోల్ కాదు. బ్యూటీఫుల్ అండ్ చాలెంజింగ్ రోల్లా అనిపించింది. నా కెరీర్లో దుల్కర్ సల్మాన్‌ను ఓ మంచి కో స్టార్‌గా చెబుతాను. జనరల్‌గా సెట్స్‌లో నేను మానిటర్ చూడను. డైరెక్టర్ ఓకే అంటే నాకు ఓకే. ఈ సినిమా రషెస్ చూసి అశ్వనీదత్ గారు నన్ను అభినందించారు. హ్యాపీ ఫీలయ్యాను. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ‘సీతారామం’ చిత్రం మంచి హిట్‌గా నిలుస్తుంది. మరోవైపు నేను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చూస్తున్నాను. పెద్ద హీరోలు కూడా ఓటీటీ స్పేస్‌లో యాక్ట్ చేస్తున్నారు. నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. అలాగే నాకు, తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు)గారికి పోలికలు ఉన్నాయని చాలామంది చెబుతుంటారు. మా అమ్మగారు తాతయ్యలా ఉంటారు. నేను మా అమ్మ పోలికలతో ఉంటాను (నవ్వుతూ). తాతగారి పోలికలు నాలో ఉండటం నా అదృష్టం’’ అన్నారు. -
మొదటి నుంచి ఏపీకి మద్ధతుగా ఉన్నాం: టీఆర్ఎస్
ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో గత సమావేశాల మాదిరిగా ఈసారి కూడా పార్లమెంటు సమావేశాలు వృధా కాకుండా ఉండేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించారని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు మొదటి నుంచి మద్ధతుగా ఉన్నామని టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీకి నష్టం జరిగిందనే సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడం ఏపీ ప్రభుత్వానికి తగదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి మా మద్ధతు అడగటం మాకు నచ్చలేదని తెలిపారు. అవిశ్వాస తీర్మాన చర్చలో తమ పార్టీ ఎంపీలు పాల్గొంటారని, చర్చలో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని వివరించారు. పార్లమెంటరీ పక్ష నేతలు ఓటింగ్‌పై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. విభజన చట్టం అమలు, కేంద్రం వైఖరి పట్ల తాము సంతృప్తిగా లేమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఇప్పుడు కూడా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ డిమాండ్లను పార్లమెంటులో కేంద్రం ముందు ఉంచుతామని సీతారాం నాయక్ తెలిపారు. -
ఇంకా మంటలు అదుపులోకి రాలేదు : డీఎస్పీ
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అగర్వాల్ రబ్బరు పరిశ్రమలో సంభవించిన ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పడానికి 6 అగ్నిమాపక యంత్రాల సాయంతో ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఈదురు గాలులు తోడవడంతో సిబ్బంది వాటిని అదుపు చేయలేక పోతున్నారు. దీనిపై డీఎస్పీ సీతారాం మాట్లాడుతూ.. ఈ రోజు తెల్లవారుజామున 2.45 గంటలను అగ్ని ప్రమాదంకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందిన వెంటనే ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఇప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదని, మరో మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదన్నారు. ఈ ప్రమాదం శాట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
ఆ సీఎం ఇంట్లో ఇప్పటికీ కరెంట్ లేదు
పాట్నా: అది బీహార్‌లోని నలంద జిల్లాలో గల కళ్యాణ్ బిగా అనే గ్రామం. అక్కడ 24గంటలు విద్యుత్ సౌకర్యం ఉండగా.. ఒక్క ఇంటికి మాత్రం అసలు విద్యుత్ కనెక్షన్ లేదు. అదేదో పేదవాడి ఇళ్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇళ్లు. ఆ ఇల్లు నిర్మించి చాలా ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఆ ఇంట్లో విద్యుత్ వెలుగులు మాత్రం లేవు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఆ ఇంటిని కాపలాగా ఉండి సంరక్షించుకునే సీతారం అనే పెద్ద మనిషి వివరణ ఇచ్చాడు. 'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కట్టుకున్న ఈ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. బీహార్‌లోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ వచ్చే వరకు తన ఇంటికి కనెక్షన్ తీసుకోనని నితీశ్ కుమార్ చెప్పారు' అని అతను చెప్పాడు. దీంతోపాటు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ నితీశ్‌పై అభిమానం కలిగి ఉన్నారని, మూడోసారి కూడా నితీశ్ ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్జేడీతో కలిసి ఈసారి జేడీయూ ఎన్నికల బరిలోకి దిగడం ప్రశ్నించగా.. నితీశ్ ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ మంచి అభివృద్ధి చేస్తాడని చెప్పాడు. ప్రారంభంలో బీహార్‌లో నేర ప్రవృత్తి ఎక్కువగా ఉండేదని, కానీ తుపాకీ సాయం లేకుండానే ఆయన దానిని నిర్మూలించాడని చెప్పారు. మున్ముందు కూడా ఇలాగే బీహార్ ఆయన ఆధ్వర్యంలోనే ఆర్థిక పురోగతి సాధిస్తుందని తెలిపాడు. -
ఎల్బీ నగర్ ఏసీపీ సీతారామ్ సస్పెన్షన్
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏసీపీగా పనిచేస్తున్న సీతారామ్‌ను సస్పెండ్ చేశారు. సివిల్ వివాదాలకు సంబంధించిన సీతారామ్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. సీతారామ్‌ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
సృజనం: మళ్లీ బాల్యం
తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు. కాలం పంపే సంకేతాలు అందుతున్నాయి. ఎట్లాగో శిఖరం ఎక్కి అక్కణ్నుంచి నెమ్మదిగా జారుతున్నాను. రోజులు ముడతలు ముడతలుగా సాగుతున్నాయి. నాకే అర్థం కాని మాటలు అసంకల్పితంగా వచ్చేస్తున్నాయి. నా మాటలు నాకే పెద్ద ధ్వనితో వినపడుతున్నాయి. కాసింత సంయమనం అవసరమని తెలుస్తూనే ఉంది. నా చేతిలో ఏముంది గనుక? అలా దూరంగా చెవులు కొరుక్కుంటారెందుకు? ఎవరి మీదా నింద వేయలేను. కాల మహిమకు వయసు ఊడిగం చేస్తూంది. మరో పదిహేనేళ్లలో శత వసంతాల నిండు జీవితం పూర్తవుతుంది నాకు. వీళ్లు నా పిల్లలే కదా... ఇది నా ఇల్లే కదా... ఈ ఇంటి గోడలు నా జ్ఞాపకాలెన్నింటినో దాచుకున్నాయి. పదేళ్ల క్రితం జీవన సహచరిని కోల్పోయాను. గతాన్ని తవ్వుకుని జ్ఞాపకాల్ని నెమరేసుకోవడమే పని. సావధానంగా కూర్చుని ఒక్కడంటే ఒక్కడు వినడు. ముసలితనం కంపు కొడుతుంది కాబోలు. క్రమేపీ ఎవరికీ అక్కర్లేని వాడిగా మారుతున్నాను. భవిష్యత్ మరీ హీనం కాకుండా నా స్థానం పదిలపరుచుకోవాలి. లేకపోతే దబ్బున పడేసి మీద నుంచి వెళ్లిపోతారు. డక్కా ముక్కీలు తిన్న మొండిఘటాన్ని. అయినా ఈవేళ జరిగిందేమిటి? పార్వతి తద్దినం. భానుమూర్తి, సీతారాం వచ్చారు. శాస్త్రోక్తంగా జరిగింది. భోజనాలయ్యాక తీరిగ్గా కబుర్లలో పడ్డారు కొడుకులు, కోడళ్లు, మనుమలు. ఇల్లంతా కోలాహలం. ఆరోగ్యవంతమైన కుటుంబ సాన్నిహిత్యం. అరవైకు చేరువౌతున్న నా పెద్దకొడుకు భానుమూర్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చిన్నకొడుకు సీతారాం పేపరు చదువుతున్నాడు. యానాంలో ఉంటున్న వారు సంబంధం లేని పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఆంధ్ర వార్తలు చదువుతారు. రాజకీయాలు వినోదంగానే కాకుండా ఉత్సుకత పెంచేవిగా కూడా ఉంటున్నాయి. సీతారాంను దగ్గరకు రమ్మని సైగ చేసి పిలిచాడు భానుమూర్తి. భానుమూర్తి, సీతారాం ఇద్దరూ పుదుచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. పుదుచ్చేరి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. యానాం విడిచి వాళ్లతో వెళ్లలేను. పాపం వాళ్లు బతిమాలుతూనే ఉన్నారు. ఇక్కడ వెలగబెట్టే రాచకార్యాలు లేవు. అజమాయిషీ చేసే ఆస్తులు లేవు. కష్టసుఖాలు కలబోసుకునే నా ఈడు చిన్న సమూహం ఉంది. నా బలహీనతలు నాకున్నాయి. తమాయించుకోలేని కోపం. కోపం వస్తే నేనెవరో నీవెవరో. భానుమూర్తి వాలకం అనుమానాస్పదంగా ఉంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. తను కూడా పుదుచ్చేరి రావాలని గట్టిగా పట్టుపడతాడేమో. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కున్నారేమో. వీలుపడదని చెప్పాలి. ఇక్కడ పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిపోయే జన్మభూమి మంత్రం జపించాలి. పరభాషా రణగొణ ధ్వనుల మధ్య దిక్కులేని అనాథగా, మూగిగా కాలం గడపలేనని చెప్పాలి. భానుమూర్తి గొంతు సవరించుకున్నాడు. ఆప్యాయంగా, అభిమానంగా, వినమ్రంగా తమ నిర్ణయాన్ని కొంచెం భయంగానే నాముందుంచాడు. నా ముఖం కందగడ్డయ్యింది. లేదు... అలా మార్చుకున్నాను. అణచుకోలేని ఆవేశం వచ్చింది. లేదు... తెచ్చుకున్నాను. జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. కుండబద్దలు కొట్టాలి. ‘‘ఎంత మాటన్నావు? మనిషిని పెట్టి సేవలు చేయిస్తావా? వంటదానికి మూడువేలు, పనిమనిషికి వెయ్యి రూపాయలు చొప్పున కుదిర్చేశావా? అక్కడితో మీ బాధ్యత తీరిపోయిందా? కుదరదు. ఒప్పుకోను. రత్నాల్లాంటి పిల్లలుండగా నాకలాంటి కర్మ వద్దు. నేను అప్పుడే పోను. మరో పదిహేనేళ్లు బతుకుతాను. అన్నదమ్ములిద్దరూ వంతులే వేసుకుంటారో వాటాలే పంచుకుంటారో నాకు తెలియదు. కుటుంబంతో సహా ఎవరో ఒకరు నా కళ్లముందుండాల్సిందే. మీ శషభిషలు నా దగ్గర పనిచేయవు’’ విరుచుకుపడ్డాను. నా కొడుకులు మంచివాళ్లు. నాకెక్కడా నొప్పి తగలనీయరు. సందేహం లేదు. కాని... కాని... అది అంతే! భానుమూర్తి బిత్తరపోలేదు. ఎప్పుడూ అదే నిదానం. ఒప్పించాలనుకుంటాడు. బలవంతం చేయడు. సీతారాం అలా కాదు. తన వాదన వినిపించడానికి చూస్తాడు. ‘‘నాన్నా! మా ఇబ్బందుల్నీ గమనించాలి. ఉద్యోగాలు చేస్తున్నవాళ్లం. అన్నన్ని రోజులు కుటుంబాలతో ఇక్కడుండటం సాధ్యమయ్యే పనా? మాతో పాటు మీరు రారని ఈ ఏర్పాటు చేశాం. మీకన్నీ తెలుసు’’ సీతారాం అన్నాడు. పుదుచ్చేరి రానని తెలుసు. వాళ్లకున్న ప్రత్యామ్నాయం ఒకటే. ఇక్కడే ఏదో ఏర్పాటు చేయాలి. కరెంటు పోయింది. ఫ్యాన్ తిరగడం ఆగింది. యానాంలో కరెంటు కోతలుండవు. ఏదో తాత్కాలిక సమస్య వచ్చుంటుంది. అక్కడున్న అట్ట తీసుకుని విసరసాగాడు భానుమూర్తి. రాజీపడలేని అలవాట్లు కొన్ని ఉన్నాయి నాకు. స్నానానికి వేడినీళ్లుండాలి. రాత్రిళ్లు ఎవరో ఒకరు కాళ్లు పట్టాలి. లేకపోతే నిద్ర రాదు. తెల్లవారుజామున అయిదు గంటలకే గ్లాసుడు కాఫీ తయారుచేసి ముందుంచాలి. ఆలస్యం అయితే చిందులేస్తాను. పొరుగింటి వాళ్లతో కలవను. పలకరింపుగా కూడా నవ్వను. సీరియస్‌గా ఉంటాను. చిన్నపిల్లలు ఎక్కడున్నా వాళ్లతో కలిసిపోతాను. ఆనందంగా శేష జీవితం గడపడానికి నావాళ్లు నా దగ్గరే ఉండాలి. ఈ విషయంలో రాజీ లేదు. మెట్టు దిగకూడదు. కోపం పూనాలి. ముఖం కవళికల్ని ఆ విధంగా మార్చుకోవాలి. ఉద్వేగంగా మాట్లాడి, ఇందులో సొంత లాభం తప్ప మరేం లేనట్టు పెద్దరికానికి లోటు రాకుండా స్థిరంగా నిలబడాలి. గభాలున లేచి, నాలుగడుగులేసి, మళ్లా వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాను. నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయిదు నిమిషాల పాటు నిశ్శబ్దం. ఈలోపులో కరెంటు వచ్చింది. ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. ‘‘అక్కడికే వచ్చి చద్దామంటే, మీరు ఇళ్ళెలా కట్టుకున్నారు? రెండేసి గదుల ఇళ్ళు. మీకూ మీ పిల్లలకే సరిపోతుంది. తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు. ఎందుకంటే మేం కాటికి కాళ్లు కాచుకునేవాళ్లం. మీరేమో కలకాలం ఉండేవారు. అంతేనా? కుటుంబం అంటే మీరూ మీ పిల్లలూ. అంతే కదా!’’ ‘‘అది కాదు నాన్నా. ఇప్పుడూ...’’‘‘పనిమనుషులు సొంతవాళ్లు ఎలా అవుతారు? మీరుండగా వాళ్ల అవసరం దేనికి? తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఓహో! మొన్న జరిగిన సంఘటన గురించా?’’ భానుమూర్తి, సీతారాం ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్లకేమీ గుర్తుకు రావడం లేదు. పొగాకు కాడ అందుకున్నాను. చుట్ట చుట్టుకున్నాను. నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లతో అంటించుకున్నాను. ‘‘నిజంగా మాకేమీ తెలియదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుంటే లెంపలేసుకుంటాం’’ భానుమూర్తి అన్నాడు. ‘‘కొన్ని కూరలు కొంతమందికి నచ్చవు. పొట్లకాయ, కాకరకాయ నాకు నచ్చదు. అదే వండారు. ఒళ్లు మండింది. పళ్లెం గిరాటేశాను. గదంతా చిందింది. కోపంతో వీధిలోకి పోయాను. గుమ్మంలో బిచ్చగాడున్నాడు. నా కోపం వాడి మీద చూపించాను. ఆవకాయ బద్దకే ఈ ఇంట్లో దిక్కులేదు. నీకు బిచ్చమెక్కడేస్తార్రా. పో పో అని గదిమాను కోడళ్లకు వినిపించేలా. కాకపోతే వాళ్లు ఉన్నవీ లేనివీ కల్పించి, మీ చెవులకు చేరవేసేవారు కాదు కాబట్టి మీకు తెలియలేదు.’’ అసలు సంగతి వేరు. చాపల్యం కొలదీ ఇంతింత ఆవకాయ ఎర్రగా కలుపుకుని తింటుంటాను. ఒంటికి తేడా వస్తుందేమోనని ఒక్క బద్ద మాత్రమే పెడతారని తెలుసు. అసహనంతో ముష్టోడి ముందు నా కోపాన్ని ప్రదర్శించాను. నెపాన్ని ఇతరుల మీదకు నెట్టడం వయసు తెచ్చే జబ్బేమో. కోడళ్లు మాట్లాడలేదు. జరుగుతున్న తంతు చూస్తున్నారు. ‘‘మీరందరూ ఇక్కడున్నారు. ఒక విషయం చెబుతాను. ప్రస్తుతం నా పనులు నేనే చేసుకుంటూ బాగానే తిరుగుతున్నాను. నాకూ ఒకరోజు వస్తుంది. ఆ వేళ అన్నం మీరే తినిపించాలి. చేయి కడగాలి. మూతి తుడవాలి. కదల్లేక మంచం మీదుంటే ఇక చెప్పేదేముంది? అలాగే వదిలేయరు కదా, మూలన పడేసి. ఈ కుటుంబం కోసం నేను పడ్డ పాట్లు మీకు తెలుసు కదా’’ ఊపిరి తీసుకుని తిరిగి మాట్లాడబోతుండగా భానుమూర్తి, సీతారాం అడ్డు చెప్పారు. చేతులు పట్టుకున్నారు. గద్గద స్వరంతో అనునయించారు. ఒకానొక ఉద్వేగ క్షణం అది. బహుశా నా మాటలు వారికెంతో బాధ కలిగించే ఉంటాయి. అయిదేళ్ల మనుమడు రైలుబండి కూత పెట్టుకుంటూ అక్కడికొచ్చాడు. మౌనం రాజ్యమేలుతున్న సమయం. వాడికిదేమీ పట్టలేదు. కిటికీ వార కింద ఉన్న బెలూన్ అందుకున్నాడు. గోడకు అణచిపెట్టి టప్మని పేల్చాడు. ఎక్కడిదో ప్లాస్టిక్ బొమ్మ దొరికింది. దాన్ని పీకి పారేస్తున్నాడు. సోఫాలపైనున్న రంగురంగుల అల్లికల గుడ్డను తీసుకుని కాళ్లతో తొక్కుతూ విసిరేస్తున్నాడు. ఎవరూ వారించడం లేదు. తప్పు అని చెప్పడం లేదు. మెల్లగా అడుగులేసుకుంటూ వాడి మమ్మీ దగ్గరికెళ్లింది. ఏం చేస్తుందో అందరూ ఆతృతగా చూస్తున్నాం. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. వాడి ఆగడాల్ని తగ్గించే మార్గం అదే అన్నమాట. అల్లరిని ఆమె ఆనందంగా స్వీకరిస్తోందా? ‘‘వాడికీ నాకూ తేడా ఏమిటిరా? వాడు ఎదిగేవాడు. నేను నేల జారేవాడిని. నన్నూ అలాగే భరించలేరా? నాలో వాడిని చూసుకోండి’’ అని కళ్లు మూసుకున్నాను. నుదుటి మీద తడి స్పర్శ. మెత్తని ఆలింగనం. భానుమూర్తి, సీతారాం ఒకళ్ల తర్వాత మరొకరు తమ పెదాల్ని నా నుదురుకు తాకిస్తున్నారు. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంటున్న తల్లుల్లాగే ఉన్నారు వాళ్లిద్దరూ. నా కళ్లూ వర్షిస్తున్నాయి, అనుకున్నది సాధించినందుకు. - దాట్ల దేవదానం రాజు