Sita Ramam Movie Pre Release Business Report Details, Deets Inside - Sakshi
Sakshi News home page

Sita Ramam Pre Release Business : భారీగా ప్రిరిలీజ్‌ బిజినెస్‌.. బ్రేక్‌ ఈవెన్‌ సాధించేనా?

Published Thu, Aug 4 2022 12:15 PM | Last Updated on Thu, Aug 4 2022 12:31 PM

Sita Ramam Movie Pre Release Business Details - Sakshi

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మరాఠీ భామ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ రష్మిక కీలక పాత్ర సోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. 

ఇక నిన్న(ఆగస్ట్‌ 3)జరిగిన ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రావడంతో ‘సీతారామం’పై మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. ఆగస్ట్‌ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగినట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.18.70 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంట. నైజాంలో అత్యధికంగా రూ. 5 కోట్లు అమ్ముడు అవ్వగా.. సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల, రెస్ట్ ఆఫ్‌  ఇండియా రూ. 0.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.5 కోట్లు, ఇతర భాషాల్లో 1.50 కోట్లు  బిజినెస్ చేసిందట.  చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే  రూ.19.50 కోట్ల వ‌ర‌కు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

(చదవండి: నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement