Pre Release Business
-
పుష్ప గాడి రూలింగ్ రిలీజ్ కి ముందే 1000 కోట్లు
-
అల్లు అర్జున్ పుష్ప-2కు కళ్లు చెదిరే బిజినెస్
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప 2: ది రూల్. సుకుమార్-బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.పుష్ప-2 విడుదలకు ఇంకా 40 రోజులకు పైగా సమయం ఉంది. అప్పుడే ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా దాదాపు రూ.1085 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. వీటిలో థియేట్రికల్‌తో పాటు డిజిటల్ రైట్స్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. దీంతో రిలీజ్‌కు ముందే ప్రీ బిజినెస్ ద్వారా వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది.పుష్ప-2 థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు గరిష్టంగా రూ. 220 కోట్లు కాగా.. ఈ సినిమా నార్త్ ఇండియా రైట్స్ రూ.200 కోట్లు, తమిళం రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ హక్కులను దాదాపు 140 కోట్ల రూపాయలకు విక్రయించారు.(ఇది చదవండి: పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. యానిమల్ బ్యూటీ కాదు.. ఆ హీరోయిన్ కోసం ప్రయత్నాలు!)ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 425 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ హక్కుల కోసం రూ. 85 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 65 కోట్లు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డిజిటల్ రైట్స్ దాదాపు రూ. 275 కోట్లకు దక్కించుకుంది. అన్ని కలిపి ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ. 1085 కోట్లు బిజినెస్ జరిగింది.అయితే ఈ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగలేదు. ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ హీరోకు లేనంతగా అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ వల్లే ఈ రేంజ్లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. -
సలార్ దండయాత్ర మొదలైంది
-
రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సలార్..
-
రిలీజ్ కి ముందే రికార్డులు
-
అనుకున్నది సాధించిన ఓం రౌత్ ప్రభాస్ ఫుల్ హ్యాపీ..!
-
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ విద్వాంసం
-
దటీజ్ విజయ్.. విడుదలకు ముందే రూ.400 కోట్ల బిజినెస్!
హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టే అతికొద్ది మంది హీరోలలో కోలివుడ్ స్టార్ విజయ్ ఒకరు. ఆయన చిత్రానికి టాక్‌తో సంబంధం ఉండకుండా మొదటి మూడు రోజులు భారీగా కలెక్షన్స్ వస్తాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల సునామే క్రియేట్ చేస్తుంది. సంక్రాంతికి విడుదలైన వారిసు(తెలుగులో వారసుడు) చిత్రమే అందుకు మంచి ఉదాహరణ. ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా.. అక్కడ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి విజయ్ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. వారిసు తర్వాత విజయ్ ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ లాంటి సూపర్ హిట్ తర్వాత లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నెట్టింట ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో అయిందట. ఇప్పటికే థియేట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కులతో సహా రూ. 400 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ కోసమే ప్రముఖ ఓటీటీ నెటిఫ్లిక్స్ రూ.120 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను సన్ టీవీ 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా సోనీ మ్యూజిక్ 18 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసింది. ఇక హిందీ శాటిలైట్ హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఇలా మొత్తంగా రూ.240 వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రాగా, థియేట్రికల్ రైట్స్ రూ.175 కోట్ల వరకు అమ్ముడు పోయాయట. మొత్తానికి విడుదలకు ముందే విజయ్, లోకేశ్‌ల సినిమా సెన్సెషన్ క్రియేట్ చేసింది. మరి విడుదల తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. -
‘సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక కీలక పాత్ర సోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న(ఆగస్ట్ 3)జరిగిన ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో ‘సీతారామం’పై మరింత హైప్ క్రియేట్ అయింది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.18.70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. నైజాంలో అత్యధికంగా రూ. 5 కోట్లు అమ్ముడు అవ్వగా.. సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.70 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.5 కోట్లు, ఇతర భాషాల్లో 1.50 కోట్లు బిజినెస్ చేసిందట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.19.50 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన టాక్ని బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: నా జేబులో డబ్బులుండవు, మాకు థియేటరే గుడి: ప్రభాస్) -
రంగ్‌దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న మూవీ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘రంగ్‌దే’ను విదేశీ హక్కుల కింద ఫార్స్ ఫిల్మ్స్ 1.5 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకోగా.. ప్రీ రిలీజ్ వ్యాపారం మొత్తం రూ. 37.5 కోట్లుగా ఉన్నట్లు తాజాగా బిజినెస్ రిపోర్టు విడుదలైంది. కాగా గతంలో నితిన్-రష్మిక మండన్నా జంటగా వచ్చిన ‘భీష్మ’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్లో వచ్చిన ‘చెక్’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బొల్తా పడింది. దీంతో నితిన్ ‘రంగ్‌దే’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మరోసారి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నితిన్‌కు ఇది హిట్‌ను ఇస్తుందా లేదా అనేది మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా... అక్కినేని అభిమానులకు ఆర్జీవీ సర్ప్రైజ్ నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్ -
చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ కొనసాగుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ మరోసారి అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన సాహో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్‌లు సృష్టిస్తోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌లోనే అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు పలికాయట. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ. 46 కోట్లు పలకగా హిందీ వర్షన్ రూ.120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు అమ్ముడైన ఓవర్సీస్ లెక్కలు రూ.42 కోట్లుగా తెలుస్తోంది. ఇవి కాక శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఇవన్ని చూస్తుంటే సాహో, బాహుబలి రికార్డ్లను సైతం తుడిచిపెట్టే ఛాన్స్ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీ, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, వెన్నల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు సంగీతమందిస్తుండగా జిబ్రాన్ నేపథ్య సంగీతమందిస్తున్నాడు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించిన గమనిక’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంచి లాభాలకు వర్మ సినిమాలను అమ్మేసినట్టుగా టాలీవుడ్ లో సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన వర్మ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబందించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు ...ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు’ అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
కళ్లు చెదిరే ‘కాలా’ రికార్డు
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఇండియావైడ్‌గా క్రేజ్ ఉంటుంది. రజనీ సెలబ్రిటీలకే సెలబ్రిటీ. తలైవా సినిమా వస్తోందంటే ఎవరైనా వెనక్కి వెళ్లాల్సిందే. రజనీ తాజా చిత్రం కాలా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. విడుదలకు ముందే ‘కాలా’ కళ్లు చెదిరే రికార్డులను నెలకొల్పింది. కబాలి ఆశించినంతగా ఆడకపోయినా ఈ సినిమా దాదాపు 600కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. కేవలం సూపర్‌స్టార్ మేనియా ఈ సినిమా కలెక్షన్లను పెంచింది. ప్రసుత్తం కాలా సినిమా విడుదలకు ముందే 230కోట్ల బిజినెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్లో 70కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 33కోట్లు, కేరళలో పది కోట్లు, రెస్టాఫ్ కంట్రీ ఏడు కోట్లు, ఓవర్సిస్ హక్కులు 45కోట్లు, థియేట్రికల్ హక్కులు 155కోట్లు, బ్రాడ్ కాస్ట్ హక్కులు 70కోట్లు, మ్యూజిక్ ద్వారా 5కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కాలాకు కష్టాలు తొలగి, విడుదలకు మార్గం సులువైతే ఇంకో 20కోట్ల బిజినెస్ జరగవచ్చు. కానీ కాలాకు కర్ణాటకలో కష్టాలు తప్పేలా లేవు. దాదాపు ఈ సినిమా 280కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్‌గా చెప్పవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. -
‘సైరా’ సందడి మొదలైంది..!
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సైరా నరసింహారెడ్డి పేరుతో తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 200 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు భారీగా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 150 కోట్లవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురువుగా నటిస్తున్న ఈ సినిమాలో ఈగ ఫేం సుధీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార చిరుకు జోడిగా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. -
రామ్ చరణ్‌ని బీట్ చేసిన అల్లు అర్జున్
సాక్షి, సినిమా : మెగా హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెలలో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ , సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లొ రామ్ చరణ్ ‘రంగస్థలం’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాల కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ కు మంచి స్పందన లభిస్తోందని తాజాగా విడుదలైన టీజర్స్‌ని బట్టి తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ కూడా అభిమానులని అలరించేలా రూపొందుతున్నట్లు ఇటీవల విడుదలైన ఇంపాక్ట్ టీజర్‌ని బట్టి తెలుస్తోంది. అయితే ఇటు రామ్ చరణ్, అటు అల్లు అర్జున్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. రిలీజ్‌కి ముందే ఈ రెండు సినిమాలు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నాయి. నిజాంలో ‘రంగస్థలం’ సినిమా రూ. 18 కోట్లకి అమ్ముడు పోగా, ‘నా పేరు సూర్య’ సినిమా రూ. 21.5 కోట్లకి సేల్ అయినట్టు తెలుస్తోంది. బన్నీ గత సినిమాలు సరైనోడు, దువ్వాడ జగన్నాధమ్ నైజాంలో మంచి రెవెన్యూ సాధించడంతో ఈ సినిమా భారీ రేటుకి అమ్ముడుపోయిందని అంటున్నారు. కాగా రంగస్థలం మార్చి 30న, నా పేరు సూర్య ఏప్రిల్ 26న విడుదల కానున్నాయి. -
రిలీజ్‌కు ముందే వంద కోట్లా..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన లేటెస్ట్ సినిమా సింగం 3 రిలీజ్‌కు ముందే రికార్డ్‌లు సృష్టిస్తోంది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే 100 కోట్ల వరకు బిజినెస్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. 24 సినిమాతో సూపర్ హిట్ కొట్టడంతో సింగం 3 సినిమా తమిళ థియట్రికల్ రైట్స్ 42 కోట్లు పలికాయి. కేవలం తమిళనాడు వరకే ఈ రేటు, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో రిలీజ్ అవుతున్న తమిళ వర్షన్‌కు మరో ఐదు కోట్లకు పైగా ధర పలుకుతోంది. మలయాళ వర్షన్ రైట్స్ సొంతం చేసుకున్న సూర్య ఫ్యాన్స్ అసోషియేషన్ దాదాపు పది కోట్ల వరకు వెచ్చిస్తోందట. ఇక తమిళనాడుకు పోటిగా భారీగా ఫ్యాన్స్ ఉన్న తెలుగులో కూడా సింగం 3కి అదే స్థాయిలో ధరపలుకుతోంది. తొలి రెండు భాగాలు ఇక్కడ కూడా సక్సెస్ కావటంతో మూడో భాగానికి మంచి డిమాండ్ ఏర్పడింది. సింగం 3 తెలుగు రైట్స్ పాతిక కోట్లు పలుకుతున్నాయి. వీటికి తోడు ఓవర్సీస్, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే సింగం 3 బిజినెస్ రిలీజ్‌కు ముందే వంద కోట్లు దాటేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. విదేశాల్లో తెరకెక్కించిన భారీ యాక్షన్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి. -
కబాలి ప్రీ రిలీజ్ లెక్క తేలింది
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కబాలి ఫీవర్ నడుస్తోంది. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మనదేశంలోని అభిమానులే కాదు.. ఇతర దేశాల్లోని సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కబాలి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ల మీద రికార్డ్‌లు తిరగరాస్తోంది. అంచనాలకు మించి కబాలి కోసం డిస్ట్రిబ్యూషన్ రేట్లు చుక్కలు తాకాయి. దాదాపు 223 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడుకు 68 కోట్లు, తెలుగు రాష్ట్రాలకు 32 కోట్లు, కేరళ హక్కులు 7.5 కోట్లు, కర్ణాటక హక్కులు 10 కోట్ల వరకు కబాలికి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్లో కూడా కబాలి సత్తా చాటింది. అన్ని దేశాలకు కలిపి 25 కోట్లకు కబాలి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో 40 కోట్లు కబాలి ఖాతాలో చేరాయి.