ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ కొనసాగుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ మరోసారి అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన సాహో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్‌లు సృష్టిస్తోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌లోనే అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు.
అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు పలికాయట. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ. 46 కోట్లు పలకగా హిందీ వర్షన్ రూ.120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు అమ్ముడైన ఓవర్‌సీస్ లెక్కలు రూ.42 కోట్లుగా తెలుస్తోంది. ఇవి కాక శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చే అవకాశం ఉంది. ఇవన్ని చూస్తుంటే సాహో, బాహుబలి రికార్డ్‌లను సైతం తుడిచిపెట్టే ఛాన్స్‌ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీ, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, వెన్నల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు సంగీతమందిస్తుండగా జిబ్రాన్ నేపథ్య సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment