సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మంచి లాభాలకు వర్మ సినిమాలను అమ్మేసినట్టుగా టాలీవుడ్ లో సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన వర్మ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబందించి గమనిక లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు ...ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు’ అంటూ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మార్చి 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment