Check, Rang De Movie Pre Release Business Including Overseas Rights - Sakshi
Sakshi News home page

రంగ్‌దే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా!

Published Thu, Mar 18 2021 1:30 PM | Last Updated on Fri, Mar 19 2021 1:05 PM

Rang De Movie Pre release Event  Business Report - Sakshi

నితిన్‌, కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా వస్తున్న మూవీ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌  చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘రంగ్‌దే’ను విదేశీ హక్కుల కింద ఫార్స్‌ ఫిల్మ్స్‌ 1.5 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకోగా.. ప్రీ రిలీజ్‌ వ్యాపారం మొత్తం రూ. 37.5 కోట్లుగా ఉన్నట్లు తాజాగా బిజినెస్‌ రిపోర్టు విడుదలైంది. 

కాగా గతంలో నితిన్-రష్మిక మండన్నా జంటగా వచ్చిన ‘భీష్మ’ బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ లీడ్‌ రోల్‌లో వచ్చిన ‘చెక్‌’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా బొల్తా పడింది. దీంతో నితిన్‌ ‘రంగ్‌దే’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మరోసారి హిట్‌ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నితిన్‌కు ఇది హిట్‌ను ఇస్తుందా లేదా అనేది మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

చదవండి: 
‘నా కనులు ఎపుడు’ లిరికల్‌ వీడియో‌ వచ్చేసిందిగా...
అక్కినేని అభిమానులకు ఆర్‌జీవీ సర్‌ప్రైజ్‌
నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement