రిలీజ్కు ముందే వంద కోట్లా..! | Suriya singam 3 pre release business | Sakshi
Sakshi News home page

రిలీజ్కు ముందే వంద కోట్లా..!

Published Sat, Nov 26 2016 2:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

రిలీజ్కు ముందే వంద కోట్లా..!

రిలీజ్కు ముందే వంద కోట్లా..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన లేటెస్ట్ సినిమా సింగం 3 రిలీజ్కు ముందే రికార్డ్లు సృష్టిస్తోంది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కు ముందే 100 కోట్ల వరకు బిజినెస్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. 24 సినిమాతో సూపర్ హిట్ కొట్టడంతో సింగం 3 సినిమా తమిళ థియట్రికల్ రైట్స్ 42 కోట్లు పలికాయి. కేవలం తమిళనాడు వరకే ఈ రేటు, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో రిలీజ్ అవుతున్న తమిళ వర్షన్కు మరో ఐదు కోట్లకు పైగా ధర పలుకుతోంది.

మలయాళ వర్షన్ రైట్స్ సొంతం చేసుకున్న సూర్య ఫ్యాన్స్ అసోషియేషన్ దాదాపు పది కోట్ల వరకు వెచ్చిస్తోందట. ఇక తమిళనాడుకు పోటిగా భారీగా ఫ్యాన్స్ ఉన్న తెలుగులో కూడా సింగం 3కి అదే స్థాయిలో ధరపలుకుతోంది. తొలి రెండు భాగాలు ఇక్కడ కూడా సక్సెస్ కావటంతో మూడో భాగానికి మంచి డిమాండ్ ఏర్పడింది. సింగం 3 తెలుగు రైట్స్  పాతిక కోట్లు పలుకుతున్నాయి. వీటికి తోడు ఓవర్సీస్, శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే సింగం 3 బిజినెస్ రిలీజ్కు ముందే వంద కోట్లు దాటేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. విదేశాల్లో తెరకెక్కించిన భారీ యాక్షన్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement