కబాలి ప్రీ రిలీజ్ లెక్క తేలింది | Kabali Pre Release Business Touches 223 Crs | Sakshi
Sakshi News home page

కబాలి ప్రీ రిలీజ్ లెక్క తేలింది

Published Tue, Jul 19 2016 12:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

కబాలి ప్రీ రిలీజ్ లెక్క తేలింది

కబాలి ప్రీ రిలీజ్ లెక్క తేలింది

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కబాలి ఫీవర్ నడుస్తోంది. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మనదేశంలోని అభిమానులే కాదు.. ఇతర దేశాల్లోని సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కబాలి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ల మీద రికార్డ్లు తిరగరాస్తోంది. అంచనాలకు మించి కబాలి కోసం డిస్ట్రిబ్యూషన్ రేట్లు చుక్కలు తాకాయి.

దాదాపు 223 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడుకు 68 కోట్లు, తెలుగు రాష్ట్రాలకు 32 కోట్లు, కేరళ హక్కులు 7.5 కోట్లు, కర్ణాటక హక్కులు 10 కోట్ల వరకు కబాలికి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్లో కూడా కబాలి సత్తా చాటింది. అన్ని దేశాలకు కలిపి 25 కోట్లకు కబాలి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో 40 కోట్లు కబాలి ఖాతాలో చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement