హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టే అతికొద్ది మంది హీరోలలో కోలివుడ్ స్టార్ విజయ్ ఒకరు. ఆయన చిత్రానికి టాక్‌తో సంబంధం ఉండకుండా మొదటి మూడు రోజులు భారీగా కలెక్షన్స్ వస్తాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల సునామే క్రియేట్ చేస్తుంది. సంక్రాంతికి విడుదలైన వారిసు(తెలుగులో వారసుడు) చిత్రమే అందుకు మంచి ఉదాహరణ. ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా.. అక్కడ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి విజయ్ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.
వారిసు తర్వాత విజయ్ ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ లాంటి సూపర్ హిట్ తర్వాత లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో అయిందట. ఇప్పటికే థియేట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కులతో సహా రూ. 400 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.
కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ కోసమే ప్రముఖ ఓటీటీ నెటిఫ్లిక్స్ రూ.120 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను సన్ టీవీ 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా సోనీ మ్యూజిక్ 18 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసింది. ఇక హిందీ శాటిలైట్ హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఇలా మొత్తంగా రూ.240 వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రాగా, థియేట్రికల్ రైట్స్ రూ.175 కోట్ల వరకు అమ్ముడు పోయాయట. మొత్తానికి విడుదలకు ముందే విజయ్, లోకేశ్‌ల సినిమా సెన్సెషన్ క్రియేట్ చేసింది. మరి విడుదల తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment