‘సైరా’ సందడి మొదలైంది..! | Business Craze For Chiranjeevi Sye Raa Narasimha Reddy | Sakshi
Sakshi News home page

Published Thu, May 17 2018 10:29 AM | Last Updated on Thu, May 17 2018 2:15 PM

Business Craze For Chiranjeevi Sye Raa Narasimha Reddy - Sakshi

ఖైదీ నంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి తన తదుపరి చిత్రం మరింత భారీగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సైరా నరసింహారెడ్డి పేరుతో తెరకెక్కిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 200 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు భారీగా బిజినెస్‌ ఆఫర్స్‌ వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 150 కోట్లవరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, నరసింహారెడ్డి గురువుగా నటిస్తున్న ఈ సినిమాలో ఈగ ఫేం సుధీప్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార చిరుకు జోడిగా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement