ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప 2: ది రూల్. సుకుమార్-బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
పుష్ప-2 విడుదలకు ఇంకా 40 రోజులకు పైగా సమయం ఉంది. అప్పుడే ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా దాదాపు రూ.1085 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. వీటిలో థియేట్రికల్‌తో పాటు డిజిటల్ రైట్స్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.
దీంతో రిలీజ్‌కు ముందే ప్రీ బిజినెస్ ద్వారా వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది.
పుష్ప-2 థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు గరిష్టంగా రూ. 220 కోట్లు కాగా.. ఈ సినిమా నార్త్ ఇండియా రైట్స్ రూ.200 కోట్లు, తమిళం రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ హక్కులను దాదాపు 140 కోట్ల రూపాయలకు విక్రయించారు.
(ఇది చదవండి: పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. యానిమల్ బ్యూటీ కాదు.. ఆ హీరోయిన్ కోసం ప్రయత్నాలు!)
ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 425 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ హక్కుల కోసం రూ. 85 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 65 కోట్లు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డిజిటల్ రైట్స్ దాదాపు రూ. 275 కోట్లకు దక్కించుకుంది. అన్ని కలిపి ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ. 1085 కోట్లు బిజినెస్ జరిగింది.
అయితే ఈ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగలేదు. ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ హీరోకు లేనంతగా అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ వల్లే ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment