పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌.. యానిమల్ బ్యూటీ కాదు.. ఆ హీరోయిన్‌ కోసం ప్రయత్నాలు! | This Bollywood Heroine Likely To Join Allu Arjun In Pushpa 2 The Rule Item Song, Deets Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 the Rule: పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌.. ఆ క్రేజీ హీరోయిన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా!

Published Mon, Oct 21 2024 9:22 PM | Last Updated on Tue, Oct 22 2024 12:16 PM

This Bollywood Heroine Select As Item Song In Pushpa 2 the Rule

టాలీవుడ్ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. గతంలో పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్‌-1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపించనుంది.

అయితే పుష్ప చిత్రంలో ఓ సాంగ్‌ అభిమానులను ఊపేసింది. ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ.. అంటూ సాంగే ఐటమ్ సాంగ్‌ ఓ రేంజ్‌లో అలరించింది. ఈ పాటకు హీరోయిన్‌ సమంత తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఐటమ్‌ సాంగ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సీక్వెల్‌లోనూ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సాంగ్‌కు హీరోయిన్‌ ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పుష్ప టీమ్‌ ఫుల్ ఫోకస్ పెట్టింది.

p

అయితే ప్రస్తుతం ఈ ఐటమ్ ‍సాంగ్‌ కోసం హీరోయిన్‌ను వెతికేపనిలో ఉంది పుష్ప టీమ్. గతంలో ఈ పాట కోసం బాలీవుడ్ భామ, యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడేమో మరో క్రేజీ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రద్ధాకపూర్‌ను పుష్ప టీమ్ సంప్రదించినట్లు సమాచారం. ఆమెను ఎంపిక చేస్తే బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ వేరే లెవెల్‌కు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే శ్రద్ధాకపూర్‌ను టీమ్ సభ్యులు కలిశారని టాక్ వినిపిస్తోంది.  అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement