దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో నటిస్తున్న రెండో చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రావడంతో ‘సీతారామం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా బాగుందని, ఇలాంటి చిత్రాలను థియేటర్స్‌లోనే చూడాలని ప్రభాస్‌తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు చెబుతున్నారు.
(చదవండి: ‘సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?)
తాజాగా ఈ చిత్రంపై ఓ సీనియర్ టెక్నీషియన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్నపూర్ణలో మెయిన్ అవుట్ హోడ్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న శ్రీ సీవీరావు సోషల్ మీడియా వేదికగా ‘సీతారామం’పై ప్రశంసలు కురిపించాడు.
‘ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో 'సీతారామం' వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని, రైటింగ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చాలా బాగుంది. ప్రతీ క్రాఫ్ట్ కు సంబంధించిన టెక్నీషియన్స్ తమ పూర్తి ఎఫర్ట్ తో ఈ మూవీకి వర్క్ చేశారు. మీ విలువైన సమయానికి థియేట్రికల్ అనుభూతిని పొందడానికి సరైన సినిమా ఇది' అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment