ఎన్నారైల ఆధ్వర్యంలో ఘ‌నంగా జీటీఏ తొలి వార్షికోత్స‌వం వేడుకలు | GTA First Anniversary Celebrations Held At Hyderabad | Sakshi
Sakshi News home page

శక్తివంతమైన భారత్‌ను నిర్మించడంలో GTA భాగ‌స్వామం కావాలి: బండి సంజయ్

Published Wed, Dec 27 2023 1:29 PM | Last Updated on Wed, Dec 27 2023 1:51 PM

GTA First Anniversary Celebrations Held At Hyderabad - Sakshi

ఎన్నారైల ఆధ్వర్యంలో జీటీఏ తొలి వార్షికోత్స‌వం వేడుకలు హైదరాబాద్‌లోని మారియట్‌ హోటల్‌లో ఘనంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ వాసులతో కలిపి ఏర్పాటుచేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. బండి సంజయ్‌తో పాటు పలువురు ఎమ్మేల్యేలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. శక్తివంతమైన భారత్‌ను నిర్మించడంలో GTA భాగ‌స్వామం కావాలని కోరారు. వివిధ దేశాల్లోని తెలంగాణ వారంద‌రిని ఒక్క‌చోట‌కు చేర్చుతున్న GTAను ఆయన అభినందించారు.  తనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, ఎంతోమంది ఎన్నారైలు డబ్బు లేకపోయినా కష్టపడి పైకి వచ్చిన వాళ్లేనన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ భారత్‌ అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివన్నారు. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఇతర దేశాల్లో చాటుతుంది తామేనని  జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి తెలిపారు. ఎన్నారై తలుచుకుంటే.. ఒక రాజ‌కీయ నాయ‌కుల‌ కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపించగలడని ఆయ‌న చెప్పారు. ఎన్నారైలు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసే వాళ్లు మాత్రమే కాదని జీటీఏ నిరూపించింద‌ని ఎమ్మెల్యే య‌శ‌శ్విని రెడ్డి అన్నారు. ఎన్నారైలు తలుచుకుంటే దేన్నైనా సాధించి చూపిస్తారని, వాళ్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. 

ఇక ఈ కార్యక్రమంలో భారత్‌కు చెందిన 150 మంది బోర్డు సభ్యులు హాజరయ్యారు. వీరిలో గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమం చైర్మన్‌ మల్లాడరెడ్డి, జీటీఏ అడ్వజర్ ఛైర్ రవీందర్ రెడ్డి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యోయో మీడియా సీఈవో నవీన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు బండిసంజయ్, య‌శ‌శ్విని, పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  గ్లోబల్ ఎన్నారైలు గ్రేట్ అండ్ మీట్‌లో పాల్గొని విజ‌యవంతం చేసిన ప్ర‌తి ఒక్క‌రికి స్పాన్సర్లకు జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement