న్యూజెర్సీలో బాలు స్వరాంజలి | Balu Swaranjali Held At New Jersey On Memory Of SPB | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో బాలు స్వరాంజలి

Published Mon, Oct 4 2021 1:55 PM | Last Updated on Mon, Oct 4 2021 4:59 PM

Balu Swaranjali Held At New Jersey On Memory Of SPB - Sakshi

ఎడిసన్, న్యూ జెర్సీ: ప్రముఖ కూచిపూడి కళాకారిణి స్వాతి అట్లూరి నెలకొల్పిన కళావేదిక ఆధ్వర్యంలో ఎస్పీ బాలు వర్థంతి వేడుకలు నిర్వహించారు. న్యూజెర్సీలోని దత్తపీఠంలో ఉన్న ఈవెంట్‌ హాల్‌లో బాలు స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖ గాయనీ గాయకులు ఉష, సుమంగళి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

సెయింట్ లూయీస్ కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళావేదిక సంస్థ ఎడ్వైజర్ కమిటీలో ఒకరైన ఫణి డొక్కా అట్లాంటానుంచి ఈ కార్యక్రమానికి వచ్చి, సంధానకర్తగా వ్యవహరిస్తూ బాలు గారితో తన అనుభవాలను పంచుకున్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్‌ ఉపేంద్ర చివుకులతో పాటు స్టెరిలీ ఎస్ స్టాన్లీ, శాంతి నర్రా , శాం జోషిలు హాజరయ్యారు. తానా, ఆటా, నాట్స్, టాటా, టిఎల్‌సీఏ, టీఎఫ్‌ఏఎస్‌, ఎన్నారైవీఏ, సిలికాన్ ఆంధ్రా, సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు. 

చదవండి : ఎస్పీబీకి ‘ఆటా’ స్వర నీరాజనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement