
న్యూజెర్సీ: విశ్వాసానికి మారుపేరు శునకం. అది ఇంటిని కాపలా కాయడమే కాదు.. ఇంటి చుట్టుపక్కల ఎవరు కాస్త అనుమానంగా కనిపించినా పిక్క పట్టుకోడానికి కూడా వెనుకాడదు. ఇపుడు చెప్పుకునే కుక్క కూడా అలాంటిదే... దాని పేరు రియో. అది నివాసముండే ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథి దర్జాగా ఇంటి పెరట్లోకి వెళ్లి పక్షులకు ఆహారం వేసే పంజరాన్ని పట్టి లాగింది. ఇంతకీ ఆ ఇంటికి వచ్చిన అతిథి ఏ పక్షో, పామో కాదు.. ఎలుగుబంటి. పంజరాన్ని కిందపడేసి అందులోని ఆహారాన్ని ఆవురావురుమంటూ తింటోంది.
ఇంతలో అక్కడికి వచ్చిన రియో.. నా ఇంటికే వస్తావా అనుకుందో ఏమో..? దాని వెంటపడి మరీ పరిగెత్తించింది. ఎలుగుబంటి తిరుగుదాడి చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా దాన్ని బెదరగొట్టింది. దీంతో హడలిపోయిన ఎలుగుబంటి ఎలాగోలా కుక్క బారి నుంచి తప్పించుకుని బతుకుజీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా ఆ వీడియోను మార్క్ స్టింజియానా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అది చూసిన జనాలు శునక ధీరత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment