
రాబిన్స్‌విల్లె: భారత్ వెలుపల నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో అక్టోబర్ 8వ తేదీన ప్రారంభం కానుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని రాబిన్స్‌విల్లె పట్టణంలో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌గా పిలుచుకునే ఈ గుడి రూపుదిద్దుకుంది.
అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12 వేల మంది కార్యకర్తలు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 183 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణానికి 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది. సుమారు 10 వేల విగ్రహాలను ఇందులో వాడారు. కంబోడియాలోని 12వ శతాబ్ధం నాటి అంగ్‌కోర్ వాట్ హిందూ ఆలయం తర్వాత బహుశా ఇదే అతిపెద్దదని అంటున్నారు. ఆలయాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు.