![Simhadri Movie Heroine Ankitha Settled In USA At New Jersey Home - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/07/10/WhatsApp%20Image%202023-07-10%20at%2019.06.28.jpeg.webp?itok=n-dynfZW)
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా మీకు గుర్తుందా?. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు. కేరళలో నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా లిస్ట్‌లో చేరింది. అయితే కొన్ని చిత్రంలో తన అందమైన కళ్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ అంకిత. 'చీమ చీమ చీమ చీమ' అంటూ సాగే సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌తో అదరగొట్టింది.
(ఇది చదవండి: 'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)
సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న భామ.. ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. విజయేంద్రవర్మ, లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు లాంటి చిత్రాల్లోనూ కనిపించింది. అయితే కొద్ది సినిమాలకే పరిమితమైన అంకిత 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించిన అంకిత ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసుకుందాం.
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన అంకిత ప్రస్తుతం అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
(ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!)
Comments
Please login to add a commentAdd a comment