
ఎడిసన్ (న్యూజెర్సీ): అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం, న్యూజెర్సీ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రులు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దారు.
తొమ్మిది రోజుల నిత్య పూజల అనంతరం అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం జరిగింది. డప్పు వాయిద్యాల హోరులో భక్తుల ఆనందంతో చేసిన నృత్యాలతో ఎడిసన్ వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి.
న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు భారీగా హాజరై ఆ గణనాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. ఎడిసన్ నడిబొడ్డున ఉన్న శివ, విష్ణు ఆలయ ప్రాంగణంలో హేరంభ పంచముఖ గణపతి కొలువై ఉన్నాడు.
చదవండి : షికాగోలో వినాయక చవితి వేడుకలు